షాకింగ్ : గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై.. ఈడీ ఎటాక్?

praveen
అక్రమాస్తులు కూడగట్టుకున్నాడని అక్రమంగా మైనింగ్ మాఫీయాని నడిపిస్తున్నాడంటూ గత కొంతకాలం నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ప్రత్యర్ధులందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలకు గుప్పిస్తున్నారు  అన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలోను కూడా ఇలాంటి విమర్శలు కాస్త ఎక్కువగానే వచ్చాయి  అయితే గతంలో గూడ మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇక ఇలా అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు కావడం సంచలనంగానే మారిపోయింది.

 ఆ తర్వాత కొన్ని రోజులకి గూడెం మధుసూదన్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఇక ఇటీవలే పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు ఈడీ అధికారులు. ఉదయం ఐదు గంటలకే గూడ మహిపాల్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న అధికారులు.. సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. కేవలం మహిపాల్ రెడ్డి ఇంట్లో మాత్రమే కాదు అతని కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ లోనీ మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడి అధికారులు ఇలా సోదరులు నిర్వహిస్తున్నారట.

 కాగా ప్రస్తుతం పటాన్ చేర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గూడెం మహిపాల్ రెడ్డికి.. అటు మైనింగ్ వ్యాపారాల తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు. ఇక గతంలో గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ కావడం బెయిల్ పై బయటికి రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై అటు ఈడి అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: