ఏపీ సెటిలర్లను మెప్పిస్తే రేవంత్ కు తిరుగులేనట్టే.. అలా చేసి బలాన్ని పెంచుకుంటారా?

Reddy P Rajasekhar
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు రావడానికి ఏపీ సెటిలర్లు కారణమని చాలామంది భావిస్తారు. ఏపీ సెటిలర్ల సపోర్ట్ లేకపోతే బీ.ఆర్.ఎస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే రేవంత్ రెడ్డి తన పాలనతో ఏపీ సెటిలర్లను మెప్పిస్తే ఆయనకు తిరుగులేనట్టేనని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
 
హైదరాబాద్ లో ప్రస్తుతం నివశిస్తున్న వాళ్లలో ఎక్కువమంది ఆంధ్రావాళ్లు ఉన్నారు. వీళ్లలో చాలామంది తెలంగాణలో పర్మనెంట్ గా సెటిల్ అయిన వాళ్లు ఉన్నాయి. కేసీఆర్ పాలనలో సెటిలర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి సైతం ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు సెటిలర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. రేవంత్ రెడ్డి ఎంతో ముందుచూపు ఉన్న నేత అని చెప్పవచ్చు.
 
ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కువమందికి మంచి జరిగేలా ఆయన నిర్ణయాలు ఉండటం కొసమెరుపు. జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారి విషయంలో సైతం రేవంత్ సర్కార్ ఒకింత కఠినంగా వ్యవహరించింది. ఏపీ సెటిలర్లకు, ఏపీ నేతలకు ఇబ్బంది కలిగించేలా మాత్రం రేవంత్ రెడ్డి ఎప్పటికీ వ్యవహరించరని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
మరోవైపు చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఒక రాష్ట్రంతో మరొకటి పోటీ పడుతున్నారు. ఇరు రాష్ట్రాలలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రజల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం. బాబు, రేవంత్ రెడ్డి బెస్ట్ పాలనను అందించి బెస్ట్ సీఎంలు అనిపించుకుంటారేమో చూడాల్సి ఉంది. ఏపీలో అమలవుతున్న స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ కాగా తెలంగాణలో అమలవుతున్న స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ గా ఉన్నాయి. కాంగ్రెస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ ను చంద్రబాబు ఏపీలో అమలు చేయడం గమనార్హం. రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: