బాబుపై ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుందన్న రేవంత్.. బాబు నుంచి ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందా?

Reddy P Rajasekhar
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. జడ్పీటీసీ సభ్యునిగా పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ ఆ తర్వాత పాలిటిక్స్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.
 
అయితే రాజకీయాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ చంద్రబాబుపై గౌరవం ఎప్పటికీ ఉంటుందని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నాకు టీడీపీ కానీ చంద్రబాబు కానీ చేసిన నష్టం లేదని కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి ఒక విధంగా తెలుగుదేశమే కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాకున్న పరిస్థితుల వల్లే టీడీపీని వీడి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరానని ఆయన తెలిపారు.
 
చంద్రబాబును నేను తిట్టాలని కొంతమంది ఆశిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో సీనియర్ ఎన్టీఆర్ గారు కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో రేవంత్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు.
 
తాను, చంద్రబాబు సహచరులం అని రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి చెబుతుండగా రేవంత్ రెడ్డి వైపు నుంచి వచ్చిన స్థాయిలో చంద్రబాబు వైపు నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా ప్రజలకు మంచి చేయడమే రెండు పార్టీల లక్ష్యం కాబట్టి కలిసి పని చేస్తే ఈ పార్టీలకు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి పాలిటిక్స్ లో ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఇతర రాష్ట్రాల ప్రజల మనస్సులను సైతం గెలుచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: