చంద్రబాబు రేవంత్ కలిసి పని చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్.. ఆ సమస్యలకు చెక్ పెడతారా?

Reddy P Rajasekhar
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ, తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పరిష్కారం కాని సంఖ్యలు పదుల సంఖ్యలో ఉన్నాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య అనుబంధం ఉంది. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తే అటు ఏపీకి ఇటు తెలంగాణకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.
 
సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల తెలుగు రాష్ట్రాల నేతల మధ్య అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది. అటు కూటమి ఇటు కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరైనా కలిసి పని చేయడం ద్వారా ప్రజలకు ఊహించని స్థాయిలో లబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బాబు, రేవంత్ మధ్య అనుబంధం వల్ల ఇరు రాష్ట్రాల స్నేహ బంధాలు మళ్లీ బలపడతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు పాలనలో తమ మార్క్ చూపిస్తూ ప్రజల్లో మంచి పేరును సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. బాబు, రేవంత్ భేటీ జరిగితే బాగుంటుందని ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
 
చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి పని చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. చిన్నచిన్న సమస్యలను ఆలస్యంగా పరిష్కరించుకోవడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రజలు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అటు బాబు ఇటు రేవంత్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో సఫలమవుతున్నారు. రుణమాఫీ హామీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైతే సూపర్ సిక్స్ హామీలు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. సంక్షేమం విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: