అంగన్ వాడీ టు అసెంబ్లీ.. సామాన్యుల జీవితాలను శిరీషాదేవి మార్చడం పక్కా!

Reddy P Rajasekhar
 
ఒక పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఫలితాలను మార్చడం సులువైన విషయం కాదు. రంపచోడవరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే శిరీష మాత్రం వైసీపీ కంచుకోట లెక్కలు మార్చేశారు. ఈమె పూర్తి పేరు మిరియాల శిరీషా దేవి కాగా 9189 ఓట్ల మెజారిటీతో ఈమె ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన సామాన్య మహిళ ఎవరనే ప్రశ్నకు శిరీషాదేవి పేరు జవాబుగా వినిపిస్తుంది.
 
అంగన్‌వాడీ కార్యకర్తగా కెరీర్ ను మొదలుపెట్టిన శిరీషాదేవి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన శిరీష సామాన్యుల కష్టాలను కళ్లారా చూశారు. ఈమె సామాన్యుల జీవితాలను మార్చడం ఖాయమని వాళ్ల జీవితాలలో వెలుగు నింపడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శిరీష పాలనలో రంపచోడవరం అభివృద్ధి జరుగుతుందని ఇక్కడి స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
 
మిరియాల శిరీషాదేవి ప్రతిభను నమ్మి చంద్రబాబు టికెట్ ఇవ్వగా ఆయన నమ్మకాన్ని శిరీషాదేవి నిలబెట్టుకున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన రంపచోడవరంలో సత్తా చాటిన శిరీషాదేవి రాజకీయాలకు సంబంధించి కూడా ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. ప్రజలకు మంచి చేయాలనే తపన, ఆలోచన ఉంటే సామాన్యులు సైతం ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకోవచ్చని ఆమె ప్రూవ్ చేశారు.
 
మిరియాల శిరీషా దేవి భర్త భాస్కర్ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నారు. కూటమి నేతల సమిష్టి సహకారం వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని శిరీషాదేవి చెబుతుండగా తన పాలనలో శిరీషాదేవి ప్రజలకు మంచి చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిరియాల శిరీషాదేవి మరింత కష్టపడి పని చేస్తే ఆమెకు భవిష్యత్తులో పార్టీలో కీలక పదవులు సైతం వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా గెలిచినా ఒదిగి ఉంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: