టీజీ భరత్ పై ఆశలు పెట్టుకున్న ఏపీ యువత.. రాష్ట్రం దశ, దిశ మార్చే నేత ఇతనేనా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల ఫలితాలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సైతం కూటమి సత్తా చాటింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కూటమికి అనుకూలంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. 11 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగా ఒక నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అందరూ ఊహించిన విధంగానే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు.
 
చంద్రబాబు టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలకు సంబంధించిన బాధ్యతలను అప్పగించారు. ఏపీకి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు రావడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. రాష్ట్ర సంపద భారీ స్థాయిలో పెరగాలంటే ఏపీకి పరిశ్రమలు రావడం మినహా మరో ఆప్షన్ లేదు. రాష్ట్రం దశ, దిశ మార్చే నేత టీజీ భరత్ అని ఏపీ వాసులు ఫీలవుతున్నారు.
 
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. కర్నూలులో టీజీ భరత్ కుటుంబానికి సొంతంగా పరిశ్రమలు ఉండగా భరత్ తన ప్రతిభతో ఎన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తారో చూడాల్సి ఉంది. టీజీ భరత్ కు కీలక శాఖలు ఇచ్చి చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని ఏపీ యువత కామెంట్లు చేస్తున్నారు.
 
రాయలసీమ యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. టీజీ భరత్ కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేసి ఈ పరిస్థితిని మారుస్తారేమో చూడాల్సి ఉంది. టీజీ భరత్ ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెడతారో లేదో చూడాల్సి ఉంది. కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని హామీల అమలు దిశగా అడుగులు పడ్డాయి. త్వరలో కూటమి నేతలు మరికొన్ని హామీలను అమలు చేయనున్నారు. ఉమ్మడి కర్నూలుకు మంత్రి పదవుల విషయంలో సైతం చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: