కూటమి చేతిలో ఈ వైసీపీ బూతు నేతలకి భారీ మూల్యం తప్పదు?

FARMANULLA SHAIK
•బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన వైసీపీ నేతలు
•వైసీపీ నేతలకు చుక్కలు చూపించునున్న పవన్, బాబు

అమరావతి - ఇండియా హెరాల్డ్:  నోరు బాగుంటేనే ఊరు బాగుంటుందని పెద్దలు ఊరికే అనలేదు. కానీ కొందరు నాయకులు అధికారం ఉంది కదా అని నోటిని అదుపులో పెట్టుకోవడంలో విఫలమవుతుంటారు. నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి విమర్శల పాలు అవుతుంటారు. ఆ సమయంలో హైలైట్ అయ్యారని బూతులు మాట్లాడితే చివరకు జనంలో బూతు నేతలుగానే మిగిలిపోతారు. అలాంటి బూతు నేతలకు ప్రజలు షాక్ ఇస్తే ఎలా ఉంటుంది? తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. బూతు నేతలుగా పేరు పేరు తెచ్చుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి వాళ్ళంతా ఓడిపోయారు.వైసీపీ నేతల్లో కొడాలి నాని ఎలాంటి మాటలు మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిపక్ష నేతలను, ముఖ్యంగా చంద్రబాబును విమర్శించడానికి కొడాలి నాని వాడే భాష… చాలా అసహ్యకరంగా ఉంటుంది.

ఇతరులను గౌరవించడం కొడాలి నానికి తెలీదు. జుగుప్సాకరంగా మాట్లాడటంలో, ప్రతిపక్ష నేతలను నోటికొచ్చినట్టు తిట్టడం నానికి అలవాటు. అందుకే ఈసారి నానికి ఆ బూతులు కలసి రాక గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఈసారి చిత్తుగా ఓడిపోయాడు. ఆ తరువాత బూతులు అంటే టక్కున గుర్తొచ్చే మరోపేరు రోజా. బూతులు మాట్లాడంతోనే ఆమె ఇమేజ్‌ సంపాదించుకున్నారు. ఎవరినైనా ఈజీగా ఎంత మాట అయినా అనగలదామె. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో ఆమె దిట్ట. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా ఆమె భాషలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్ళీ ఆమెని ఏమైనా అంటే ఏడవటం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఆమెను నగరి ప్రజలు ఇంటికి పంపించారు. గత రెండు ఎన్నికల్లో కూడా తక్కువ మెజారిటీతో గెలిచిన రోజా… ఈసారి భారీ తేడాతో ఓడిపోయింది.

జోగి రమేష్‌, అనిల్‌ కుమార్‌, అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం మాటతీరు గురించి కూడా ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమేలేదు. బూతులతో ఫేమస్ అయ్యారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి లాంటివారు కూడా చేసిన పనులతో కాకుండా బూతులతోనే బాగా ఫేమస్‌ అయ్యారు.  గోరంట్ల మాధవ్‌ బూతు బాగోతం ఆంధ్రా అంతా లైవ్‌ షోనే చూసేసింది.నోటికొచ్చినట్టు మాట్లాడటం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రజలు ఏదైనా అడిగితే పరుషంగా మాట్లాడటం, కసురుకోవడం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులని తమ మాటలతో బాగా కోపం తెప్పించి వారిని బాధ పెట్టారు.ఇప్పుడు వాళ్ళు అధికారం దక్కించుకొని ఆకలితో ఉన్న సింహాల్లా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి చుక్కలు చూపించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: