దేశంలోనే అధిక పారితోషకం తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరంటే.. చంద్రబాబు ఎన్నో స్థానమంటే..?

Divya
భారతదేశంలో ముఖ్యమంత్రులు జీతంతో పాటు తమ తమ రాష్ట్రాలలో అమలు చేయబడిన నిబంధనల ప్రకారం ప్రయోజనాలు వారి యొక్క జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఏ రాష్ట్ర సీఎంకు ఎక్కువ జీతం లభిస్తుంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అసలు వీరికి జీతం ఉంటుందా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రిలకు జీతాల వ్యత్యాసం కచ్చితంగా ఉంటుంది. అయితే దేశంలో ముఖ్యమంత్రులకు వసతి వాహనం భద్రత దేశం మరియు వివిధ విదేశాలలో ఎక్కడైనా తిరిగి స్వేచ్ఛ కూడా కలిగే ఉంటుంది.

దేశంలో చాలామంది ప్రభుత్వాలు సొంతంగానే విమానాలు హెలిప్ కాటర్స్ సైతం కలిగి ఉంటారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ నిర్మించిన విధంగా ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఒకో జీతం వేరువేరుగా ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జీతానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. అలాగే ముఖ్యమంత్రి జీవితంలో డియర్ నెస్ అలవెన్స్ అనేవి కూడా ఉంటాయి. మరి రాష్ట్రాలవారీగా ముఖ్యమంత్రుల జీతం విషయానికి వస్తే..

1). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి -3,35,00
2). తెలంగాణ ముఖ్యమంత్రి-4,10,000
3). ఢిల్లీ ముఖ్యమంత్రి-3,90,000
4). మహారాష్ట్ర-3,40,000
5). గుజరాత్ ముఖ్యమంత్రి-3,21,000
6). ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి-3,65,000
7). హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి-3,10,000
8). జార్ఖండ్ ముఖ్యమంత్రి-2,55,000
9). హర్యానా ముఖ్యమంత్రి-2,88,000
10). మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి-2,30,000
11). చతిస్గడ్ ముఖ్యమంత్రి-2,30,000
12). పంజాబ్ ముఖ్యమంత్రి-2,30,000
13). గోవా ముఖ్యమంత్రి-2,20,000
14). బీహార్ ముఖ్యమంత్రి-2,15,000
15). పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి-2,10,000
16). తమిళనాడు ముఖ్యమంత్రి-2,05,000
17). కర్ణాటక ముఖ్యమంత్రి-2,00,000
18). సిక్కిం ముఖ్యమంత్రి-1,90,000
19). ఒడిస్సా ముఖ్యమంత్రి-1,60,000

దీన్ని బట్టి చూస్తే ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి కే అత్యధికంగా జీతం వస్తుందని చెప్ప వచ్చు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్ర బాబు నాయుడు ఐదవ స్థానంలో ఉన్నారు. అయితే ఈ జీవితం మొత్తం ఆయా రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుందని చెప్ప వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: