కేసీఆర్‌ : నాకు నోటీసులు ఇచ్చుడు కాదు...మీరే తప్పుకోండి ?

Veldandi Saikiran
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు లేఖ ద్వారా సమాధానమిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విద్యుత్ కొనుగోలు విషయంలో 12 పేజీలతో కమిషన్‌కు వివరణ ఇచ్చారు కేసీఆర్‌. ‘మా హయంలో కరెంట్ వియంలో గణనీయమైన మార్పు చూపించాం. ప్రజలకు 24 గంటల విద్యుత్ అందించాం. రాజకీయకక్షతోనే కమిషన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహిరించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్పచ్ఛందంగా కమిషన్‌ నుంచి స్వచ్చంధంగా తప్పుకోవాలని సూచించారు కేసీఆర్‌.

 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని.... ఇది జగమెరిగిన సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయిందని...తెలంగాణ రాష్ట్రంలో పవర్ హాలిడేలు కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేదని... త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

 
దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89% ఆంధ్రప్రదేశ్ కు 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ను వినియోగించుకోవాలని నిర్దేశించిందని తెలిపారు కేసీఆర్‌. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 27 వల్ల 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగా ఓట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడిందన్నారు. మొత్తంగా ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని... దీన్ని అధిగమించి కొత్త ప్రాజెక్టులు నిర్ణయించి కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు విద్యుత్తు 20000 మెగావాట్లకు పైచిలుకు చేరటం మా ప్రభుత్వానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యనించారు.

 
రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అ ప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందని ఆగ్రహించారు. కరెంటు కోసం గలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పదిహేడు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతెల్సి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయని కేసీఆర్‌ ఆగ్రహించారు. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: