రోజాకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలో సిఐడి విచారణ?

praveen
మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం హయాంలో కీలక నేతగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ మాటల తూటాలు పేల్చిన రోజాపై.. ఇక ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఏమైనా ప్రతీకరం తీర్చుకుంటుందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే రోజా చుట్టూ ఉచ్చు బిగిస్తుందా అంటే ప్రస్తుతం అవుననే మాటే ఎక్కువగా వినిపిస్తుంది  ఏకంగా సిఐడి అధికారులు రోజాను విచారించేందుకు సిద్ధమయ్యారు అంటూ ఒక ప్రచారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 ఆడుదాం ఆంధ్ర లో ఏకంగా 100 కోట్ల స్కాం జరిగిందని టిడిపి ప్రభుత్వం భావిస్తుందట. ఈ విషయం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు అన్న విషయం తెలిసిందే. క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఆమెకు ఇలా క్రీడా శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు అప్పటి సీఎం జగన్. ఈ క్రమంలోనే ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు  పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు జరిగాయి.  ఈ పోటీలలో అడుగడుగున అవినీతి జరిగినట్లు ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ విషయం బయటపడిందని.. దీనిపై ఏపీ సిఐడి కి ఫిర్యాదులు కూడా వెలువెత్తుతున్నాయట. వివిధ క్రీడా సంఘాల ప్రతినిధుల ఫిర్యాదు చేస్తున్నారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

 క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆర్కే రోజా షాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కూడా వివాదాస్పద నేతలే. గతంలో వైసిపి అధికారంలో ఉండగా టిడిపిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినవారే. ఈ క్రమంలోనే వీరిపై గట్టిగానే చర్యలు ఉండబోతున్నాయి అన్నది తెలుస్తుంది. మొత్తం 100 కోట్లు అక్రమాలు జరిగాయని.. క్రీడా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారట. చాలా చోట్ల పోటీలు నిర్వహించకుండానే విజేతలను ఎంపిక చేసారని   వైసీపీ నేతల సిఫారసులకు పెద్దపీట వేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో క్రీడా కోట ద్వారా ఉన్నత విద్యా ప్రవేశాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయట. ఈ అవకతవకల్లో సూత్రధారిగా రోజా ఉండగా ఇక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా హస్తము ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది  ఈ క్రమంలోనే త్వరలోనే సిఐడి విచారణ జరిగే అవకాశం ఉంది అని టాక్. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: