ఏపీ: ఆ విషయంలో వైసీపీని ఫాలో అవుతున్న టీడీపీ?

Suma Kallamadi
ఆంధ్రాలో ఓ జిల్లా ఉంది. అక్కడ ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసిపి, తాజాగా తొలిసారి టీడీపీ అక్కడ స్వీప్ చేసింది. కట్ చేస్తే ఆ జిల్లాకు 2 మంత్రి పదవులు వరించాయి. ఇక్కడ చెప్పుకోతగ్గది ఏమిటంటే అధికారం మారినా ఆ లెక్క అక్కడ మారకపోవడం. ఇంతకీ ఏ జిల్లా అని అనుకుంటున్నారా? అదే నెల్లూరు జిల్లా. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చి ఇక్కడ క్లిన్ స్వీప్ చేయడం అందరికీ తెలిసినదే. ఆ సందర్భంలో కూడా మంత్రి వర్గంలో ఈ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కడం విశేషం. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఆ దక్కిన రెండు మంత్రి పదవులు ఒకటే స్థానాలు కావడం యాదృశ్చికం.
నెల్లూరు సిటి నుంచి గతంలో అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు నుంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డికి తొలివిడత మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా అవే నియోజకవర్గాలనుంచి గెలుపొందిన నెల్లూరు సిటి నుంచి పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణ రెడ్డిలకు తొలివిడత జాబితాలో మంత్రి పదవులు దక్కడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ఏ కారణంగా జరిగింది తెలియదు కానీ వరుసగా 2 పర్యాయాలు ఆ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దాంతో కానీ క్యాబినెట్‎లో బెర్తుల కోసం ఆశించిన కొందరు ఎమ్మెల్యేలు ఇపుడు మా సంగతి ఏంటి? అని అడుగుతున్నారు.
నారా లోకేష్ యువగలం పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి యాత్ర విజయవంతం కోసం పనిచేసారు. నారా లోకేష్ కూడా ఆ సందర్భంగా నెల్లూరు రూరల్‎లో కోటంరెడ్డి బ్రదర్స్ ఎఫర్ట్‎ను ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. దీంతో కోటంరెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గం గట్టిగా నమ్మింది. అప్పటికే వరుసగా ఓటమి చెందిన సోమిరెడ్డి ఈ సారి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి మంత్రివర్గంలో తన పేరు పక్కా అనుకున్నారు. కానీ నిరాశ మిగిలింది. రెండున్నరేళ్ళ తర్వాత అయినా మార్పులు చేర్పుల్లో అవకాశం ఎవరికి దక్కుతుందో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: