ఐటీ శాఖకి లోకేష్ తగినవాడంటారా?

Purushottham Vinay

•గతంలో ఐటి మంత్రిగా లోకేష్ అట్టర్ ప్లాప్

•కేటీఆర్ తో పోలుస్తూ లోకేష్ పై ఎన్నో విమర్శలు

•ఐటి బాధ్యతలు చంద్రబాబు తీసుకుంటే బెటర్

అమరావతి - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. తన తనయుడు నారా లోకేష్ కు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను చంద్రబాబు కేటాయించారు. అయితే ఆయన ఐటీ  శాఖకి తగిన వాడా అని చూస్తే కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2014 వ సంవత్సరంలో టీడీపీ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు లోకేష్ ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఐటి శాఖ మంత్రిగా లోకేష్ సరిగ్గా రాణించలేకపోయారు. ఒక్క కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాలేకపోయారు. అందుకే ఆ టైంలో ఆయన చాలా విమర్శలు ఎదురుకున్నారు. ఇక అప్పటికే పక్క రాష్ట్రం అయిన తెలంగాణాలో ఐటి శాఖ మంత్రిగా కెసిఆర్ తనయుడు కేటీఆర్ దూసుకుపోతున్నాడు. తెలంగాణ ఐటి శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

హైదరాబాద్ ని ఐటి హబ్ గా చేసేందుకు మరింత ముందుకి వెళ్లి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా అమెజాన్ ఆఫీస్ ని హైదరాబాద్ లో కట్టించేందుకు కృషి చేశాడు. అలాంటి కేటీఆర్ తో పోలుస్తూ నారా లోకేష్ ని తెగ ట్రోల్ చేశారు. ఐటి శాఖ మంత్రి అంటే కేటీఆర్ లా ఉండాలి ఆయన్ని చూసి నేర్చుకో లోకేష్ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే లోకేష్ ఈ 2024 వ సంవత్సరంలో భారీ మెజారిటీతో గెలిచారు. ఒకప్పుడు ఐటి మినిస్టర్ గా అట్టర్ ప్లాప్ అయిన లోకేష్ అప్పుడే ఏమి చేయని లోకేష్ ఇప్పుడు ఏం చేస్తారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఐటి శాఖ బాధ్యతలు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడే తీసుకుంటే బాగుండు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అప్పుడు ఐటి శాఖ మంత్రిగా ఫెయిల్ అయిన లోకేష్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా గత వైసీపీ అధికారంలో నిరుద్యోగులతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఐటి హబ్ గా మారుస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: