పేరుకే హోమ్ మినిస్టర్.. నడిపేదంతా..ఆ బాబు గారేనా?

Divya
•టీచర్ కి హోమ్ మినిస్టర్ గా పదవి..
•నడిపేది చంద్రబాబేనా..
•హోమ్ మినిస్టర్ డమ్మీ నుండి ఒరిజినల్ అయ్యేనా..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ఎలక్షన్స్ ముగిసాయి..  ఫలితాలు వెలువడ్డాయి.. ఇక మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విభాగంలో మంత్రి పదవిని నారా చంద్రబాబునాయుడు కేటాయించిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంలోనే ఆయన కాస్త చిన్న చిన్న తప్పులు చేశారని తెలుస్తోంది... అనుభవం ఉన్నవారికి ఆ రంగంలో మంత్రి పదవి ఇవ్వకుండా వేరే రంగానికి సంబంధించి పదవి ఇవ్వడంతో ఇక వారు ఆ విభాగంలో సక్సెస్ అవుతారా? లేదా ? అన్నది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది. ఇక అందులో ప్రధమంగా వినిపిస్తున్న పేరు వంగలపూడి అనిత.. ఈమెకు హోమ్ మినిస్టర్ గా మంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలోనే చాలామంది రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
నిజానికి వంగలపూడి అనితకు టీచర్గా మంచి అనుభవం ఉంది. ఇక ఆమె ప్రొఫైల్ విషయానికి వస్తే 1984 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా,  ఎస్ రాయవరం మండలంలోని..  లింగరాజుపాలెం గ్రామంలో జన్మించిన ఈమె.. 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ.. ఎమ్ ఈ డి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి.. 28 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉపాధ్యాయురాలిగా మంచి అనుభవం ఉన్న ఈమె ఇలా రాజకీయాలలోకి అడుగుపెట్టి అనూహ్యంగా 2014లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గము నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థి చెంగల వెంకట్రావు పై 2,828 ఓట్ల ఆదిక్యంతో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టింది..

 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైన ఈమె 2019లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తానేటి వనిత చేతిలో ఓటమిపాలయ్యింది.. తిరిగి 2021 జనవరి 30న ఆంధ్ర రాష్ట్రం తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితురాలు అయింది. ఇక ఈసారి జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికై.. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు.. అయితే తాజాగా ఈమెకు ఈ పదవి అంటగట్టడంతో అందరూ పేరుకే హోమ్ మినిస్టర్ నడిపేదంతా చంద్రబాబు ఈమె పాత్ర కేవలం దమ్మి అంటూ కామెంట్లు చేస్తున్నారు..
నిజానికి వైయస్సార్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో మేకతోటి సుచరిత, తానేటి వనిత ఇద్దరూ హోమ్ మినిస్టర్లుగా పనిచేసిన విషయం తెలిసింది.. ఇక వీరందరూ కూడా కేవలం హోమ్ మినిస్టర్లు గానే పేరుకి పనిచేశారు.. కాకపోతే వెనుక నుండి వీరిని వారే నడిపించారనే వార్తలు వినిపించాయి.. ఇప్పుడు వంగలపూడి అనితకు కూడా విద్యాశాఖ ఇచ్చుంటే బాగుండేదని.. కానీ ఇప్పుడు ఈమెకు  హోమ్ మినిస్టర్ కట్టబెట్టడం వల్ల పేరుకే హోమ్ మినిస్టర్..  నడిపేదంతా చంద్రబాబు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.. మరి ఈ విషయాన్ని ఆమె దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా హోం మినిస్టర్ గా సక్సెస్ అయితే మాత్రం ఇక ఈమెకు తిరుగు ఉండదు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: