ఇది రాజకీయం అంటే: ఇక అనిల్ కుమార్ రాజకీయ సన్యాసమేనా..?

Veldandi Saikiran
రాజకీయాల్లో అంటేనే సవాళ్లు... ప్రతి సవాళ్లు ఉంటాయి. కచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు వీటిని ఎదుర్కొంటారు. అయితే అందులో కొందరు సవాల్ విసిరి ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది సవాలు విసిరి పారిపోతారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన సవాల్ హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన సవాల్ ను ఎవరు స్వీకరించలేదని... తాను రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు అనిల్ కుమార్ యాదవ్.

వాస్తవానికి.. మొన్నటి ఎన్నికల్లో... ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అనిల్ కుమార్ యాదవ్... జగన్ ఆదేశాల మేరకు నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ... అత్యంత దారుణంగా ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. కానీ ఎన్నికల సమయంలో... ఓ సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్. తాను నరసరావుపేట లోక్సభ నుంచి... ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.

కానీ ఫలితంగా ఎన్నికలలో ఓటమి పాలయ్యారు అనిల్ కుమార్. ఈ లెక్కన ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ మాట మార్చారు అనిల్ కుమార్ యాదవ్.  తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పింది నిజమేనని.... కానీ తాను సవాలు విసిరితే అవతలి వ్యక్తి... ప్రతి సవాల్ చేయలేదని ఇప్పుడు మాట మార్చారు.  తన సవాల్ కు అవతలి నుంచి వాడు సవాలు తీసుకుంటేనే...  తన సవాల్ కచ్చితంగా అమలు చేసే వాడినoటూ అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు.

కానీ ఎన్నికల కంటే ముందు నేను విసిరిన సవాల్  ను టిడిపి తీసుకోకుండా పారిపోయిందని..  ఇక ఇప్పుడు నేను ఆ సవాల్ కు ఎలా కట్టుబడి ఉంటానని మండిపడుతున్నారు. తనపై ట్రోలింగ్ చేసుకుంటే చేసుకొని అని... తనకేం బాధ లేదు అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఎక్కువ ట్రోలింగ్ జరిగితే మనం సక్సెస్ అయినట్లు... అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్... సవాల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హార్ట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: