చంద్ర‌బాబు రాంగ్ కేబినెట్‌: నాదేండ్లకు ఆ పదవి వస్తే..జనసేనలో జోష్ ఉండేది ?

Veldandi Saikiran
* అపార రాజకీయ అనుభవం
* సౌమ్యుడు
*  పవన్ కు హనుమంతుడిలాంటోడు
* స్పీకర్ గా ఆరితేరాడు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ తో పాటు  దాదాపు పది సంవత్సరాలుగా నడిచారు. ఈ నేపథ్యంలోనే... అనేక కష్టాలు అనుభవించిన జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్... ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా... ఇప్పుడు మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన కోసం కష్టపడ్డ వారిలో... నాదెండ్ల మనోహరుడు ఒకరు.

అయితే అలాంటి నాదెండ్ల మనోహర్ కు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. ఆహారం, పౌరసరఫరాల శాఖను సీనియర్ లీడర్ ఐన నాదేండ్ల మనోహర్ కు అప్పగించారు. దాదాపు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పని చేశారు. సుదీర్ఘకాలం ప్రకారం ఏపీ స్పీకర్గా పనిచేసిన అనుభవం నాదేండ్ల మనోహర్ కు ఉంది. అలాంటి వ్యక్తికి...  అసలు పౌరసరఫరాల శాఖ ఎందుకు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా జనసేనకు మూడు మంత్రి పదవులు వచ్చాయి. అందులో ఏ ఒక్కటి కూడా నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తప్ప... కీలక శాఖ రాలేదని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమి బలంగా ఉండాలంటే... నాదెండ్ల మనోహర్ లాంటి... నేతకు ఆర్థిక శాఖ ఇస్తే బాగుండేదని చెబుతున్నారు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్..  కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు.

ఆర్థిక లెక్కల్లో అపార మేధావి. అంతేకాదు జనసేన పార్టీ ఆర్థిక లావాదేవీలు కూడా మన నాదేండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. ఇటు అసెంబ్లీలో కూడా ఎలా వ్యవహరించాలి అనే దానిపై ప్రత్యేక అవగాహన ఉంది. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం కూడా నాదేండ్ల మనోహర్ కు ఉంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే న్యాయకుడు. అలాంటి నేతకు ఆర్థిక శాఖ ఇస్తే... ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగేదని అంటున్నారు. ఏపీకే కాకుండా జనసేన పార్టీలో కూడా... ఆర్థిక శాఖ వచ్చిందంటే కాస్త సంబరం ఉండేది. కానీ చంద్రబాబు అలా చేయకుండా మొండి చేయి చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: