2024 ఎలక్షన్స్: దేశంలోని భారీ ఓట్ బ్యాంక్ సాధించిన పార్టీలు.. టిడిపి కంటే వైసీపీ ముందు..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసిపి పార్టీ ఘోరపరాజయాన్ని మూటకటుకుంది.. కూటమి బ్రహ్మాండమైన మెజారిటీలతో అధికారంలోకి వచ్చిన తాజాగా పరిణామాలు చూస్తూ ఉంటే కాస్త ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తోంది. ఎన్నికలలో అత్యధికంగా ఓట్లు సాధించిన జాబితాను సైతం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబితాలో వైసీపీ పార్టీకి 5 స్థానం లభించింది. అధికార పార్టీ అయినా తెలుగుదేశం పార్టీకి ఆరవ స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యధికంగా ఓట్లను సాధించిన పార్టీల జాబితాను సైతం కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే వెల్లడించింది.

దేశంలో అత్యధిక ఓట్ల శాతం పొందినటువంటి పార్టీలలో మొదటి ఐదు స్థానాలలో టిడిపికి అసలు అవకాశమే దక్కలేదు.అత్యధిక లోక్ సభ గెలుపొందిన బిజెపి పార్టీ  36.56% వరకు ఓటింగ్ రాగ కాంగ్రెస్ పార్టీకి 21.19% ఓటింగ్ లభించింది. అలాగే సమాజ్ వాదీ పార్టీకి 4.58% ఓటింగ్ రాగ త్రుణమాల్ కాంగ్రెస్ పార్టీకి 4.37% శాతం ఓటింగ్ లభించింది.. వైసీపీ పార్టీకి 2.06% ఓటింగ్ లభించగా బీఎస్పీ పార్టీకి 2.04% ఓటింగ్ మాత్రమే లభించింది ఇక ఆ తర్వాత స్థానం టిడిపికి 1.98% ఓటింగ్ లభించింది.. చివరిగా డీఎంకే పార్టీకి 1.82% ఓటింగ్ లభించింది అందుకు సంబంధించిన ఒక ట్విట్ సైతం వైరల్ గా మారుతోంది.

కేవలం 11 స్థానాలు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలను గెలిచిన వైసిపి పార్టీ ఐదవ స్థానంలో రావడం ఆశ్చర్యానికి. అయితే ఇందులో ఒక వైసీపీ పార్టీ తప్ప ఇందులో ఉన్న ఏదో పార్టీ కూటమితో జత కట్టడం జరుగుతోంది. టిడిపి స్థానం ఏడవ స్థానంలో ఉండడం ఈ విషయం అటు నేతలకు కార్యకర్తలకు సైతం మింగుడు పడడం లేదు. టిడిపి జనసేన బిజెపి పార్టీలు కూటమి కట్టిన ఓట్ల శాతం అంత తక్కువ రావడంతో అందరిని టిడిపి జనసేన బిజెపి పార్టీలు కూటమి కట్టిన ఓట్ల శాతం అంత తక్కువ రావడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో వైసిపి నేతలు కార్యకర్తలు సైతం ఈ విషయాన్ని వైరల్ గా చేస్తూ ఉన్నారు. వైసిపి పార్టీ ఓటమి అయినప్పటికీ తమకంటే ఎక్కువగానే ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందా అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: