ఏపీ: జగన్ సంచలన నిర్ణయం.. వైసిపి నేతలకు పండగేనా.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  ఈ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగాయి.  రిజల్ట్స్ ఎవరు ఊహించని విధంగా వచ్చిందని చెప్పవచ్చు. ఇక జగన్ అలాంటి రిజల్ట్ వస్తుందని అస్సలు ఊహించి ఉండరేమో. వై నాట్ 175 అంటూ ఎంతో ఉదారగొట్టే, మాటలు మాట్లాడిన జగన్  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం లోకి వచ్చినట్టే చేశారు. చివరికి రిజల్ట్స్ వరకు వచ్చే సరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.  దారుణమైన ఓటమి ని చవి చూసింది. అలాంటి జగన్ ఓడిపోయిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ అక్కలు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్లు  ఇలాంటి రిజల్ట్ ఎందుకు ఇచ్చారు పథకాలు మీ ఇంటికి ఇచ్చినందుకా అంటూ  ఎంతో ఎమోషనల్ అయ్యారు.  

అయినా జగన్ కు మాత్రం ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గలేదు. 45 శాతం ఓటింగ్  అలాగే ఉంది.  టిడిపి కూటమి తో బిజెపి జనసేన కలిపి పోరాడితే,  జగన్ ఏకపక్షంగా పోరాడి 45% ఓటింగ్ సాధించారంటే అక్కడ నైతికం గా విన్ అయింది జగన్ మాత్రమే అని చెప్పవచ్చు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి సంబంధించినటు వంటి కారణాలు ఏంటి అనేది గల కొన్ని రోజుల నుంచి సమీక్ష చేస్తున్నారు. అంతే కాకుండా   కార్యకర్తలను మరియు నాయకులకు భరోసా ఇవ్వడం కోసం మరో కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. అదే జగన్ యాత్ర. జగన్ అధికారంలోకి తీసుకువచ్చింది పాదయాత్ర.

అదే పాదయాత్ర తో మళ్ళీ జగన్ ఎక్కడ  పోగొట్టుకున్నారో, అక్కడి నుంచి రాబట్టుకోవాలనే విధంగా  మరోసారి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ప్రజల తో మమేకమవుతూ పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారట. దీనికి కార్యచరణ ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ  తప్పకుండా ప్రజల్లోకి మళ్లీ వెళ్లాలని ఆయన ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడం తో వైసీపీ అభిమానులు కార్యకర్తలు అంతా  ఆనంద పడుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: