చంద్ర‌బాబు రాంగ్ కేబినెట్‌ - ఇండియా హెరాల్డ్ డ్రీమ్‌ కేబినెట్: టీజీ భరత్‌కు ఆ శాఖ ఇచ్చినట్లయితే..??

Suma Kallamadi
* ఏపీలో కొలువుతీరిన కేబినెట్‌.. తప్పులో కాలేసిన చంద్రబాబు  
* నేతలకు అనుభవం ఉన్న శాఖల్లో కాకుండా వేరే శాఖల్లో నియామకం  
* టీజీ భరత్‌కు ఇండియా హెరాల్డ్ డ్రీమ్‌ కేబినెట్ ఫైనాన్స్ మినిస్టర్
(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రివర్గంలో ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీల నుంచి 25 మంది చోటు సంపాదించుకున్నారు. వారిలో టీజీ భరత్ ఒకరు. ఆయనకు పరిశ్రమల శాఖ అప్పజెప్పారు. టీజీ భరత్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఎం.డీ. ఇంతియాజ్‌ అహ్మద్‌పై 18,876 ఓట్ల మెజార్టీ సాధించారు. భరత్ యూకేలో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఈ కోర్సు ఫైనాన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మార్కెటింగ్ వంటి టాపిక్స్‌ను కవర్ చేస్తుంది.
యూకేలో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు కాబట్టి ఫైనాన్స్ పట్ల భరత్ కు మంచి పట్టు ఉండి ఉంటుంది. ఆ శాఖకు ఆయనను మంత్రిని చేసినట్లయితే బాగుండేది అని మేం భావిస్తున్నాం. మంచి ఫైనాన్షియల్ ప్లాన్స్‌తో స్టేట్ బడ్జెట్ ను పర్ఫెక్ట్ గా ప్రవేశపెట్టి ఉండేవారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఇప్పుడు ఆయన కొత్తగా అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆల్రెడీ రంగంపై అనుభవం ఉంటుంది కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఉండేవారు.
ఆనం రామనారాయణరెడ్డి 9 సంవత్సరాల పాటు ఫైనాన్స్ మినిస్టర్ గా పని చేశారు. ఆయన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను కూడా అద్భుతంగా ప్రవేశపెట్టారు. అయితే ఆయనకున్న ఈ అనుభవాన్ని ఉపయోగించుకోకుండా ఫైనాన్స్ మినిస్ట్రీ వేరే వాళ్ళకి ఇచ్చారు. యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్ భరత్ కి కాకుండా, అనుభవం ఉన్న రామనారాయణ రెడ్డికి కాకుండా ఆర్థిక మంత్రి పదవిని పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు. చంద్ర‌బాబు కేటాయించిన కొన్ని రాంగ్ కేబినెట్స్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచించారే గానీ ఎవరికి ఏది బాగా సూట్ అవుతుందో సమాలోచనలు చేయనట్లుంది. అంత అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో చాలా కీలకమైన మంత్రి పదవుల విషయంలో అడుగులు వేయడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: