ఏపీ:జగన్ ను ఫాలో అవుతున్న ఏపీ సీఎం..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి తన కర్తవ్యాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మొదటి సంతకంగా మెగా డీఎస్సీ మీద సంతకం చేసి ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ మీద మరొక సంతకం పింఛన్ పెంపు యువతకు స్కిల్ డెవలప్మెంట్ అన్న క్యాంటీన్ వంటి వాటి మీద సంతకం పెట్టారు.. ముఖ్యంగా గతంలో వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే కలవగానే కచ్చితంగా వారికి సహాయం చేస్తూ ఉండేవారు. ఇలాంటి వాటితోనే సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు జగన్.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. దీంతో అలాంటి వారిని కలిసి మరి వారి యొక్క అనారోగ్య సమస్యలను తెలుసుకొని తన వంతు సహాయంగా చేస్తూ ఉన్నారు తాజాగా దివ్యాంగురాలు అయిన మహిళ ఆరుద్ర అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈమెకు పదివేల రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తానంటూ కూడా ఆమె ఇచ్చారు. ఆరుద్ర కుమార్తె వైద్యానికి అవసరమయ్యే ఐదు లక్షల రూపాయలు సహాయాన్ని కూడా అందించారు.. గత వైసిపి ప్రభుత్వం అందించలేదని దీంతో చాలా ఇబ్బందులు పడిందని ఆరుద్ర తేలుస్తోంది.

అయితే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నీ  కలిసేందుకు వెళ్తే కలవనివ్వలేదని విమర్శలు కూడా వచ్చాయి. ఆరుద్ర ఆస్తిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు కూడా చేసింది. అయితే నిన్నటి రోజున సీఎం చంద్రబాబును కలిసిన ఈమె దివ్యాంగుల పెన్షన్ కింద అందిస్తామని భరోసా ఇచ్చారు. తన మానవత దృక్పథంతో చంద్రబాబు ఆమెకు అండగా నిలిచారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన సీఎంవో తన ట్విట్టర్ నుంచి చంద్రబాబు చేసిన ఈ సహాయాన్ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు ఫాలో అయ్యి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ బేస్ ని మరింత పెంచుకునేలా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: