మంత్రి కొల్లును క‌ష్టాల్లో ప‌డేసిన చంద్ర‌బాబు..!

RAMAKRISHNA S.S.
- గ‌తంలో చేనేత‌, బీసీ సంక్షేమం.. ఇప్పుడు గ‌నులు, ఎక్సైజ్‌
- మ‌ద్యం పాల‌సీ మార్పు కొల్లుకు క‌త్తిమీద సామే
- వైసీపీ పాల‌న‌లో గ‌నుల కుంభ‌కోణం బ‌య‌ట పెట్టాలి..!
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
తాజాగా టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు శాఖ‌ల‌ను కేటా యించారు. క‌ష్ట‌ప‌డి.. పార్టీ కోసం ప‌నిచేసిన వారిని కేబినెట్‌లోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి కృష్ణాజి ల్లాలోని మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంద‌క్కించుకున్న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొల్లు ర‌వీంద్ర‌కు చంద్ర‌బాబు ఛాన్స్ ఇచ్చారు. ఆయ‌న‌ను మంత్రిగా తీసుకున్నారు. గ‌తంలోనూ కొల్లుకు చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో అవ‌కాశం క‌ల్పించిన విష‌యం తెలిసిందే.

ఇక‌, తాజాగా కేబినెట్ మంత్రుల‌కు శాఖ‌ల‌ను కూడా కేటాయించారు. వీటిలో కొల్లుర‌వీంద్ర కుమార్‌కు గ‌నుల శాఖ‌ను కేటాయించా రు. అయితే.. ఈ శాఖ‌పై కొంత చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన కొల్లు ర‌వీంద్రకు  చేనేత, ఎక్సైజ్, బిసి సంక్షేమం, సాధికారత అనే రెండు శాఖలను చంద్ర‌బాబు కేటాయించారు. ఏప్రిల్ 2017 లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత లా అండ్ జస్టిస్ (న్యాయ‌శాఖ‌), స్కిల్ డెవలప్‌మెంట్, యూత్, స్పోర్ట్స్, నిరుద్యోగ ప్రయోజనాలు, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అయితే.. వాటికి భిన్నంగా ఇప్పుడు గ‌నుల శాఖ‌ను అప్ప‌గించ‌డంతో కొల్లు దీనిపై అవ‌గాహ‌న పెంచుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. పైగా వైసీపీ హ‌యాంలోనే గ‌నుల కుంభ‌కోణాలు చోటు చేసుకున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ గ‌నుల‌ను సొంత వారికి ఇచ్చేయడం.. వాటి ద్వారా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యం లో వాటిపైనా విచార‌ణ చేయించాలి. ఇక‌, ఇసుక అక్ర‌మాలు.. ఇసుక పాల‌సీ ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు వాటిని కూడా స‌రిచేయాల్సిన బాధ్య‌త ఏర్ప‌డింది.

ఎక్సైజ్ లోనూ..
ఎక్సైజ్ మంత్రిగా కూడా కొల్లు ర‌వీంద్రే ఉన్నారు. దీంతో మ‌ద్యం విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌పై ఎంతో ఉంది. గ‌త వైసీపీ స‌ర్కారు మ‌ద్యం విధానాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తామంటూనే చీపు లిక్కరును విక్ర‌యించ‌డం.. వాటిని తాగిన వారు మ‌ర‌ణించిన సంద‌ర్భాలు.. అనారోగ్యం పాలైన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాము అధికారంలోకి వ‌స్తే.. మద్యం పాల‌సీని మారుస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు కొల్లు ర‌వీంద్ర‌పై ఆబాధ్య‌త ఉంది. అదే స‌మ‌యంలో క‌ల్లు గీత కార్మికుల‌కు 10 శాతం మేర‌కు దుకాణాలు కేటాయిస్తామ‌ని మేనిఫెస్టోలోనూ పేర్కొన్నారు. దీంతో ఈ హామీని కూడా ఆయ‌న నెర‌వేర్చాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: