ఏపీ:ఎక్కడ ఆపానో అక్కడే మొదలు.. నారా లోకేష్..!

Divya
నారా లోకేష్ గెలిచిన తర్వాత ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా తనకు కేటాయించిన మంత్రి పదవుల పైన ఇచ్చిన శాఖల పైన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి విద్య, ఐటి, ఎలక్ట్రానిక్, ఆర్టిజి శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును అయితే నారా లోకేష్ షేర్ చేశారు.. అయితే తాను మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపాను మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెడతానంటూ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అడుగు వేస్తానని తెలిపారు లోకేష్.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనతో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుందని వెల్లడించారు.. అయితే ఎలక్ట్రానిక్ కంపెనీని ఆకర్షించడానికి రాష్ట్రం నుంచి వలసలు వెళ్లాల్సిన యువత అవసరం ఉండదని యువతకు ఉద్యోగాలు కల్పించడానికి తాను 2019లో వదిలిపెట్టిన చోటు నుంచి తిరిగి మళ్ళీ పనిని ప్రారంభిస్తారని తన పైన నమ్మకం నుంచి ఇలాంటి శాఖలు కేటాయించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ గా పనిచేసిన తన గత అనుభవం ఇప్పుడు జీవనోపాధికి ఉపయోగపడుతుందని అలాగే గ్రామీణ ప్రాంతాలకు తీసుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు.

నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవా అని భావించి పంచాయతీరాజ్ శాఖగా గ్రామాల రూపురేఖలు మార్చానని.. ఐటి ,ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఎన్నో కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని కూడా తెలిపారు. గత అనుభవం నేర్పిన పాటలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా కూడా పనిచేస్తానని.. యువ గళం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థలలో ఎన్నో మార్పులు తీసుకువస్తానంటు లోకేష్ హామీ ఇచ్చారు.. తనకు గ్రామీణ విద్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపారు నారా లోకేష్. తన ట్విట్టర్ నుంచి మంత్రి నారా లోకేష్ చేసిన ట్విట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: