ఏపీ: అప్పుడు జగన్ రిటర్న్ గిఫ్ట్.. ఇప్పుడు బాబు రిటర్న్ గిఫ్ట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత నాయకులు సైతం ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ అనే పదాలు సైతం వాడుతూ ఉంటారు. క్రిందటి సారి ఆపదం బాగా ఎక్కువగా వినిపించింది. అందుకు కారణం 2018 ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జతకట్టి మరి పోటీ చేయడం జరిగింది. ఇతర పక్షాలన్నిటిని కలుపుకొని టిఆర్ఎస్ ను ఊడగొట్టడానికి ప్రయత్నం చేసింది. అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి మరి విజయాన్ని సాధించింది. ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. రేపొద్దున తన సత్తా చూపెడతా బిడ్డ అని చెప్పడం.. చెప్పడంతో పాటు జగన్ను ఎంకరేజ్ చేస్తూ చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించిందని అదే రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా భావించారు చాలామంది నేతలు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఏమిటంటే జగన్కు రిటర్న్ గిఫ్ట్ అన్నటువంటిది.. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష సమయంలో ఉన్నప్పుడు పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు అలాగే పలువురు నాయకులు మీద కేసులు పెట్టడం వేధించడం వంటివి జరిగింది. ఇప్పుడు జగన్ టీం మీద కూడా అదే మీమ్స్, కేసులు పెట్టడం వంటివి జరుగుతోంది. ఇది రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అనేటువంటిది వినిపిస్తున్నాయి.

రాజకీయంగా జగన్కు రిటర్న్ గిఫ్ట్, బాబుకి రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి వాటిలో తప్పేమీ లేదు.. కానీ భౌతికంగా లేదా ప్రజాస్వామ్యంలో దాడులు ప్రతి దాడులు అనేది ఎవరు చేసిన కూడా తప్పే అని చెప్పవచ్చు. ఈ ఒక్క విషయంపైనే నేతలు కార్యకర్తలు సైతం ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో టిడిపి పార్టీ గెలిచిన తర్వాత కూటమి నేతలు సైతం వైసీపీ నేతల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. మరి ఇకమీదటైనా ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: