అప్పుడు వైఎస్సార్ ఇప్పుడు జగన్.. చంద్రబాబు ఖాతాలో చెరిగిపోని విజయాలివే!

Reddy P Rajasekhar
ఒక రాష్ట్రానికి సీఎం కావడం అంటే సులువు కాదు. ఒక్కసారి సీఎం కావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు సీఎం అయ్యారంటే ఆయన కష్టం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1999లో కాంగ్రెస్ ను ఓడించి వైఎస్సార్ కు షాకిచ్చిన చంద్రబాబు 2014, 2024 సంవత్సరాలలో వైసీపీని ఓడించి జగన్ కు షాకిచ్చారు. ఈ విజయాలు చంద్రబాబుకు మరపురాని విజయాలు అని చెప్పవచ్చు.
 
చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలంటే మొదట ఆయన విజన్ గురించి మాట్లాడుకోవాలి. టెక్నాలజీపై ఎప్పుడూ దృష్టి పెట్టే చంద్రబాబు మారుతున్న కాలానికి అనుగుణంగా తాను కూడా మారుతూ ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో అఖండ విజయం సాధించిందంటే బాబు కష్టమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
చంద్రబాబు నాయుడుకు సవాళ్లు కొత్త కాదు. ఆ సవాళ్లను ఆయన అధిగమించడం కూడా కొత్త కాదు. వచ్చే ఐదేళ్లలో అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో చంద్రబాబు అభివృద్ధి చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ యువత చంద్రబాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను చంద్రబాబు నిజం చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
చంద్రబాబు నేను మారిన మనిషిని అని చెప్పుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రాబోయే ఐదేళ్లలో చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి సమానంగా ప్రాధాన్యత ఇస్తే ఆయనకు తిరుగుండదని చెప్పవచ్చు. చంద్రబాబు జగన్ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్త పథకాలను సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. పథకాల అమలు విషయంలో చంద్రబాబు ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. బాబు, పవన్ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో గత ఐదేళ్లతో పోల్చితే ప్రజలకు మెరుగైన పాలన అందే అవకాశాలు ఉంటాయని కామెంట్లు వ్యక్తమౌతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: