మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన నిర్మలమ్మ.. ఈ రికార్డుల మంత్రి ప్రత్యేకతలివే!

Reddy P Rajasekhar
మన దేశ ప్రజలకు నిర్మలా సీతారామన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళరాడు రాష్ట్రంలోని మధురై నిర్మలా సీతారామన్ స్వస్థలం కాగా జె.ఎన్.యూ నుంచి ఆమె ఎంఫిల్ పూర్తి చేశారు. కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈరోజు మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 2.0 లో ఆర్థిక మంత్రిగా ఆమె సేవలు అందించడం జరిగింది. నిర్మలా సీతారామన్ పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే ఏపీ నుంచి రాజ్యసభకు తొలిసారి ఆమె ఎన్నికయ్యారు.
 
రెండోసారి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆమె ఎంపిక కావడం జరిగింది. 2014 సంవత్సరంలో మోదీ సర్కార్ అధికారంలో ఉండగా సహాయ మంత్రిగా ఆమె సేవలు అందించారు. 2017లో రక్షణ శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ విధులు నిర్వహించారు. 2019 నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తి ంచి ప్రశంసలు అందుకున్నారు. నిర్మలా సీతారామన్ ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రి కావడం గమనార్హం.
 
మన దేశంలో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పని చేసిన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. 2019లో కేంద్ర బడ్జెట్ ను సైతం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. ఎక్కువసార్లు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ సైతం ఆమె ఖాతాలో ఉంది. దేశంలో కరోనా సమయంలో నాలుగైదు చిన్న బడ్జెట్ లను విడతల వారీగా ప్రవేశపెట్టారు.
 
ఇలా మినీ బడ్జెట్ లను ప్రవేశపెట్టిన ఘనత సైతం నిర్మలా సీతారామన్ కే సొంతమని చెప్పవచ్చు. నిర్మలా సీతారామన్ సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించడం నిర్మలా సీతారామన్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: