టీడీపీ...బీజేపీ సత్సంబంధాలు బలగం ఉండడానికి పవన్ ముఖ్య వారధిగా నిలవాల్సిందేనా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేడు అని వేలెత్తి చూపిన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకు అనుగుణంగానే 2019 ఫలితాలు వచ్చాయి. అందులో జనసేన పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆయన పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో కూడా ఓడిపోవడంతో ప్రత్యర్థులకు ఎలాంటి దెబ్బ కొట్టలేకపోయాడు. అలాంటి సమయంలోనే పవన్ తన వ్యూహాత్మక ప్రణాళికలను రచించాడు. వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అదే సమయంలో చంద్రబాబు ను జైల్లో పెట్టించారు. అప్పటికే పవన్, బిజెపితో పొత్తు పెట్టుకుని ఉన్నాడు.

ఇక చంద్రబాబును జైల్లో పెట్టడంతో ఆయనను వెళ్లి కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదు. మనమందరం కలిసికట్టుగా జతకట్టి ఎలక్షన్లలోకి దిగాలి అనే ప్రతిపాదనను చంద్రబాబు ముందు ఉంచాడు. ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అక్కడే అసలు కథ మొదలైంది. అప్పటికే బీజేపీ, జనసేన పొత్తులో ఉండడంతో మమ్మల్ని అడగకుండా మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే వాదన కూడా వచ్చినట్లు బయటికి వార్తలు వచ్చాయి. కానీ ఎలాగోలాగా ఒప్పించి మూడు పార్టీలను కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో పవన్ మొదటి విజయం సాధించారు.

ఇక ఆ తర్వాత సీట్ల పంపిణీ ఎలాగో తెలుగుదేశంకు కాస్త ఎక్కువ క్రేజ్ ఉండడంతో వారికి ఎక్కువ సీట్లు ఇచ్చి , ఆ తర్వాత జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ , బిజెపి 8 అసెంబ్లీ స్థానాలను తీసుకుంది  అంతా సజావుగా జరిగింది. ఇక రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయం. పక్కా ప్రణాళికతో అన్ని సెట్ చేశారు. ఇక రిజల్ట్ చూస్తే బంపర్ హిట్. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి అంత బలమైన మెజారిటీ రాలేదు. దానితో ఇదే చంద్రబాబు, పవన్ కి ముందున్న సవాల్ ప్రత్యేక స్టేటస్ తీసుకురావడం. మరి పవన్, బిజెపిని ఒప్పించి తెలుగుదేశం పార్టీతో జత కట్టడానికి ముఖ్య వారధిగా నిలిచాడు. అదే పాత్ర పోషించి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సి ఉంది అని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో పవన్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: