ఏపీ భవిష్యత్తు: జగన్ చేసిన తప్పే.. బాబోరు చేయరుగా..?

Divya
•యువత టాలెంట్ ను ఉపయోగించుకుంటే ఆంధ్ర అభివృద్ధి తథ్యం
•రైతన్నలే తొలి లక్ష్యం
•ఆంధ్ర అభివృద్ధి కోసం బాబు కష్టపడక తప్పదు>>
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎటు పోతుందో అనే ఆందోళన అటు యువతలో ఇటు ప్రజలలో ఈమధ్య మరింత ఎక్కువవుతుందని చెప్పాలి.. ఎవరు పరిపాలనలోకి వచ్చినా సరే అసలు ఆంధ్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న.. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర.. అభివృద్ధి వైపు అడుగులు వేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..  ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పరుగులు పెడుతుంటే అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నత్త నడకన సాగుతోంది.. ముఖ్యంగా సరైన రోడ్లు లేక .. నీటి సదుపాయాలు లేక.. మురుగు కాలవ సమస్యలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. అంతేకాదు యువతకు సరైన సమయంలో ఉద్యోగాలు లభించక వారి టాలెంట్ మొత్తం నీరుగారిపోతోంది.. పైగా ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు కానీ సరైన అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తమ టాలెంటును అక్కడ ఉపయోగించి ఆ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
అందుకే సరైన సమయంలో యువత యొక్క టాలెంట్ను ఒడిసిపట్టి మన రాష్ట్రం కోసం ఏం చేయగలరు అనే విషయాలను బయట పెట్టగలగాలి.. ఒక రకంగా చెప్పాలి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే యువత ముందడుగు వేయాలి. ఇదంతా పక్కన పెడితే.. గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎంతో చేశాను అని చెప్పుకుంటున్నారు. ఒక్క సంక్షేమ పథకాల వల్ల ప్రజల అభివృద్ధి ఏమాత్రం జరగదు..  ముఖ్యంగా రైల్వే జోన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్రకు సరైన రైలు మార్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. అయితే విశాఖపట్నంలో మాత్రమే తూతూ మంత్రంగా కొన్ని రైళ్ళని కేటాయించిన బిజెపి ప్రభుత్వం.. ఇతర ప్రాంతాలలో ఎక్కడ కూడా ఈ రైల్వే జోన్ అభివృద్ధి చెందలేదు.
మరొకవైపు నీటి ప్రాజెక్టులు.. ముందుగా అందరికీ గుర్తొచ్చేది పోలవరం ప్రాజెక్టు మాత్రమే..  ఇదే కాకుండా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోయాయి.. ఈ ప్రాజెక్టులు కనుక సక్సెస్ అయితే రైతులకు నీటి కొరత ఉండదు.. రైతులు ఒకరి పైన ఆధార పడాల్సిన అవసరం లేదు.. రైతు అభివృద్ధి చెందాడంటే ఆటోమేటిగ్గా ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది.. అన్నపూర్ణగా ఆంధ్రకు పెట్టింది పేరు.. అలాంటి అన్నపూర్ణమ్మకే ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.. అందుకే కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని అటు రైతులకు ఇటు యువతకు న్యాయం చేకూరుస్తూ ముందడుగు వేస్తే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: