రామోజీరావుకు అస్వస్థత.. వెంటిలేటర్ పై చికిత్స..!

Divya
ఈనాడు సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మరొకసారి నిన్నటి రోజున మధ్యాహ్నం రామోజీరావు తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిలిం సిటీ లో ఆయన నివాసం ఉంటున్నారు. నాయక్ రామ్ గూడా లోని స్టార్ హాస్పిటల్స్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. అక్కడ వైద్యులు రామోజీరావుకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

అయితే గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న రామోజీరావు తాజాగా ఆసుపత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల గుండెకు సంబంధించిన వ్యాధుల కారణంగా ఆయనకు వైద్యులు చికిత్స చేసి స్టంట్ లు కూడా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 87 సంవత్సరాలు ఈయన ఆరోగ్య పరిస్థితి కొంతమేరకు ఆందోళననే కలిగిస్తోంది.రామోజీరావు ఆరోగ్య పరిస్థితిల పైన వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది

రామోజీరావు ఆరోగ్య పరిస్థితి అప్డేట్ కోసం అటు కుటుంబ సభ్యులు అభిమానులు సమస్త సిబ్బంది కూడా చాలా ఎదురుచూస్తున్నారు.. మరొకవైపు ఈ వార్త తెలియడంతో చాలామంది ప్రముఖులు ఆయన శ్రేయోభిలాషులు కూడా స్పందిస్తూ ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం అంటూ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా స్పందిస్తూ అస్వస్థకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ప్రజా పక్షమైన అక్షరాన్ని నిలిపిన మార్గదర్శి మీరు కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తారంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది. వెంటిలేటర్ పై కూడా చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి తాజా ఆరోగ్య పరిస్థితి అప్డేట్ వస్తే కానీ ఏంటనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: