కాంగ్రెస్ షర్మిల బ్రష్టు పట్టించింది... సుంకర పద్మశ్రీ..!

Pulgam Srinivas
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం ఎంతో కష్టపడింది. ఆయన జైల్ లో ఉన్న సమయంలో పార్టీని ముందుండి నడిపించింది. ఇక ఆ తర్వాత వీరి కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావడంతో ఈమె తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ ని కూడా స్థాపించింది.

కొంత కాలం పాటు ఆ పార్టీని తెలంగాణ లో మంచి స్థాయికి తీసుకువెళ్లడానికి పాదయాత్ర కూడా చేసింది. కానీ ఆ తర్వాత ఈమె 2023 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ నుండి ఎవరిని బరిలోకి దింపలేదు. ఆ తర్వాత ఈమె ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇక ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఎన్నిక అయింది. ఈమె ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసింది.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికలలో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. దీనిపై తాజాగా ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుంకర పద్మ శ్రీ అనేక ఆరోపణలు చేసింది. తాజాగా ఈమె మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల పార్టీ నుండి వచ్చిన ఫండ్స్ ను దాచుకుంది. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. కార్యకర్తలను , నేతలను ఆమె గాలికి వదిలేసింది. రాహుల్ గాంధీ ని చూసే ఆమెను ఏమనలేకపోయాం. కక్ష పూరిత చర్యల కోసమే ఆమె రాష్ట్రానికి వచ్చినట్లు అనిపిస్తుంది అని సుంకర పద్మ శ్రీ మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: