మల్కాజ్గిరి ప్రజల రూటే సపరేటు.. ఎప్పుడు ట్విస్టులే?

praveen
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పిలుచుకునే మల్కాజిగిరిని మినీ ఇండియా అని అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో లేనంత మంది ఓటర్లు ఇక్కడ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారూ సైతం ఇక్కడ సెటిలై ఇక ఓటర్లుగా కొనసాగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మినీ ఇండియాలో గెలుపును అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మల్కాజిగిరిలో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించవచ్చు అని నమ్ముతూ ఉంటారు ఆయా పార్టీల నేతలు.

 ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇక మల్కాజ్గిరిలో  గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని హామీల వర్షం కురిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎవరెన్ని హామీలు కురిపించిన.. అటు మల్కాజ్గిరి ప్రజల రూటు మాత్రం ఎప్పుడు సపరేటే. ఎందుకంటే ఒక్కసారి గెలిపించిన వారిని మరోసారి గెలిపించిన దాఖలాలు అస్సలు ఉండవు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం లో విజయం ఎవరిది అనే విషయంపై ఎప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అయితే 2024 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది.

 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం అదే రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం కుర్చీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్కు సిట్టింగ్ స్థానం కావడంతో రేవంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక మల్కాజ్గిరి లో విజయం కోసం ఎంతో తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజలు మాత్రం ఎప్పటిలాగానే ట్విస్ట్ ఇచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ ను కాకుండా ఏకంగా బిజెపికి పడటం కట్టారు. బిజెపి తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్ కు మూడు లక్షలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అయితే ఇక్కడ 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించగా.. 2014లో టిడిపి అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించగా.. ఈసారి ఈటల రాజేందర్ కు భారీ మెజారిటీ అందించి విజయాన్ని కట్టబెట్టారు. ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మల్కాజిగిరి ప్రజల రూటే సపరేటు అని అన్న విధంగా ఫలితాన్ని అందిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Evm

సంబంధిత వార్తలు: