తిరుపతి ఎంపీ స్థానం వైసీపీ సొంతం.. వైసీపీ అభ్యర్థి ఓట్ల మెజారిటీ లెక్క ఇదే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఎంపీ స్థానంలో విజయం కోసం అటు వైసీపీ ఇటు కూటమి ఎంతో కష్టపడ్డాయనే సంగతి తెలిసిందే. తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మద్దిల గురుమూర్తి పోటీ చేయగా కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి వరప్రసాదరావు పోటీ చేశారు. అయితే తిరుపతి పరిధిలో వైసీపీకే బలం ఎక్కువగా ఉండటంతో వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి సునాయాసంగా విజయం సాధించారు.
 
వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా మంచి పేరు ఉండటం, వైసీపీ పథకాలపై ప్రజల్లో సదభిప్రాయం ఉండటం మద్దిల గురుమూర్తికి కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మద్దిల గురుమూర్తి గెలుపు వైసీపీ నేతల సంతోషాన్ని రెట్టింపు చేసిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
తిరుపతి పార్లమెంట్ ఎన్నిక హోరాహోరీగా జరగగా మొదట వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడటంతో ఆయన విజయం సాధించడం సులువు కాదని కామెంట్లు వినిపించాయి. అయితే ప్రతి రౌండ్ లో ఆయన బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావుతో తలపడుతూ ఎట్టకేలకు విజయం సాధించారు. గురుమూర్తికి మొత్తం 6 లక్షల 32 వేల 228 ఓట్లు దక్కగా 14,659 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.
 
కష్టకాలంలో ఉన్న వైసీపీకి గురుమూర్తి విజయం ఒకింత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మద్దెల గురుమూర్తి విజయంతో తిరుపతి వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కు సైతం 6 లక్షల 17 వేల 659 ఓట్లు పోల్ అయినా ఆయన మాత్రం ఓటమిపాలయ్యారు. తిరుపతిలో కచ్చితంగా సత్తా చాటుతామని బీజేపీ భావించగా ఆ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. తిరుపతిలో విజయం కోసం మద్దిల గురుమూర్తి ఒకింత ఎక్కువగానే కష్టపడ్డారని అయితే ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన ఆ కష్టాన్ని మరిచిపోతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: