భారత్ లో ఆ ఘనత దక్కింది జనసేనకే.. పవన్ రికార్డ్ ఎవ్వరూ బ్రేక్ చేయలేరుగా!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గత నెల 13వ తేదీన జరిగాయి. ఈ రోజున ఫలితాలు విడుదల కావడం జరిగింది.. అయితే కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు మూకుమ్మడిగా వైసీపీ పార్టీ పైన గెలవడం జరిగింది.. ఇటీవల ప్రెస్ మీట్లకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంత మంచి చేసిన కూడా ఎలా ఓడిపోయామో తెలియదంటూ అయినా కూడా ప్రజలకు అండగానే ఉంటానని మాట ఇస్తున్నాను అంటూ తెలిపారు.. అంతేకాకుండా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను ప్రతిపక్షంలో ఉండడం ఇదే మొదటిసారి కాదు ఎప్పటికీ తన ప్రజలకు అండగానే ఉంటానని తెలిపారు.

ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వైసీపీ నేతలు నాకు శత్రువులు కాదు.. కేవలం ఐదు కోట్ల మంది ప్రజల కోసమే తను పార్టీని పెట్టానని.. తను చెప్పినట్టుగానే కూటమిని అధికారంలోకి తీసుకువచ్చానంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.. అలాగే తన జీవితమంతా ఎప్పుడూ కూడా ఎన్నో దెబ్బలు తిన్నాను మాటలు కూడా పడ్డాను చాలామందితో తిట్టించుకున్నాను అయినా కూడా తన పైన ఇంత ప్రేమ ఉండి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

అలాగే భారత దేశంలో 100 కి 100 సీట్లు కొట్టింది జనసేన పార్టీ మాత్రమే అని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు . దీంతో పవన్ అభిమానులు కూడా ఆనందానికి అవధులు లేవు.. ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ఇతర ముఖ్య నేతలతో జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే ఇంకా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం లేదు.. కేవలం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రెస్మీట్లో మాట్లాడడం జరిగింది.. మరి కూటమి అనుకున్నట్టుగా అన్నిటి పథకాలను అమలు చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: