పెడన : తండ్రికి ఘ‌న‌విజ‌యంతో ఘ‌న‌నివాళి ఇచ్చిన టీడీపీ కాగిత‌...!

RAMAKRISHNA S.S.
కృష్ణా జిల్లాలోని పెడన నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కొత్త ప్రత్యర్థులు పోటీపడ్డారు. 2019 ఎన్నికలలో దివంగత టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు తనయుడు కాగిత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి.. మంత్రి జోగి రమేష్ వైసీపీ నుంచి పోటీ పడగా.. ఆ పోరులో జోగి రమేష్ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. నియోజ‌క‌వ‌ర్గం లో పెడ‌న మున్సిపాల్టీ తో పాటు పెడ‌న‌, బంటుమిల్లి , కృత్తివెన్ను , గూడూరు మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గం లో కాపుల‌తో పాటు బీసీల్లో గౌడ‌, మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం బాగా ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన భారీగా ఓట్లు చీల్చ‌డంతో ఇక్క‌డ టీడీపీ ఓడిపోయింది. అయితే ఈసారి మార్పులు, చేర్పులలో భాగంగా జగన్.. జోగి రమేష్ ను పెనమలూరు కు పంపారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా పని చేసిన ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాంప్రసాద్‌ను పెడన బరిలో దింపారు.

ఉప్పాల రాంప్రసాద్ 2014లో కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 10 ఏళ్లకు ఆయనకు వైసీపీ నుంచి తన సొంత నియోజకవర్గం పెడనలో పోటీ చేసే అవకాశం దక్కింది. ఇద్దరూ బీసీలలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందినవారు కావటం .. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం.. జనసేన , పవన్ అభిమానులు ఓటింగ్ టీడీపీకి బాగా కలిసి రావడంతో.. ఇక్కడ ముందు నుంచి తెలుగుదేశం కచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు గత ఎన్నికలలో కాగిత కృష్ణ ప్రసాద్ ఓడిపోవడం.. సానుభూతి కూడా ఆయనకు కలిసి వచ్చింది.

ఇక తాజా ఎన్నిక‌ల్లో అంతిమ విజేత‌గా.. టీడీపీ అభ్య‌ర్థి కాగిత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్ విజ‌యం సాధించ‌డంతో పాటు ఫ‌స్ట్ టైం అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నార‌ను. కాగిత‌కు ఏకంగా 37620 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. మొత్తానికి కాగిత వెంక‌ట్రావుకు వార‌సుడు కృష్ణ ప్ర‌సాద్ ఇచ్చిన ఘ‌న‌మైన నివాళిగా ఈ విజ‌యాన్ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: