గుండెలవిసేలా బాధ పడుతూ మాట్లాడిన జగన్.. రైతులకు ఎంత చేసినా లాభం లేదా?

Divya
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోర పరాభవం పొందిన విషయం తెలిసింది.. వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన ఆయన ప్రజలను పూర్తిస్థాయిలో నమ్మారు.. కానీ ప్రజలు ఆయనను పూర్తిగా ముంచేశారు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 175 స్థానాల్లో పోటీకి నిలువగా కేవలం 10 స్థానాలలో మాత్రమే విజయం సాధించారు.. ఇంతకంటే దారుణమైన పరాభవం మరెక్కడా కనిపించదేమో. ముఖ్యంగా తాను ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు ఏ స్థాయిలో లబ్ధి పొందారో వారే తమ మనస్సాక్షితోనే చెప్పాలి అని జగన్ తాజాగా పెట్టిన ప్రెస్మీట్లో ప్రశ్నించారు.. ముఖ్యంగా 54 ల‌క్ష‌ల మంది రైత‌న్న‌ల‌కు ఇన్‌ఫుట్స్ స‌బ్సిడీ, రైతు భ‌రోసా టైంకు ఇచ్చాము. ఉచిత ఇన్సూరెన్స్ ఇచ్చాము.. ప‌గ‌టి పూట 9 గంట‌ల ఉచిత విద్యుత్ ఇచ్చాము.. రైతుల కోసం ఇంత చేసినా సరే కనీసం రైతులు కూడా మమ్మల్ని నమ్మలేకపోయారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా గుండెల విసేలా బాధపడుతూ.. ఆ బాధను బయటకు చెప్పుకోకుండా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు చెబుతూ తన గొప్ప మనసును మరోసారి నిరూపించుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అటు మహిళలకు , ఇటు విద్యార్థులకు,  యువతకు ప్రతి ఒక్కరికి కూడా తన వంతు సహాయాన్ని అందించారు.. ఆర్థిక సహాయం అందించడమే కాదు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలకు విద్యార్థులను పంపించే విధంగా ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి పథకం పేరిట అటుతల్లలకు కూడా సహాయము చేశారు.

అటు ఆటో డ్రైవర్లకు ఇటు మత్స్యకారులకు ఒకరికి ఏమిటి ప్రతి ఒక్కరికి అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి సుమారుగా రూ.45 వేలకు పైగా సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏమాత్రం గుర్తుపెట్టుకో లేకపోవడం ఇంతకంటే విషాదకరం మరెక్కడ లేదేమో.. కనీసం డిపాజిట్లు కూడా దక్కనంతగా ఘోరంగా ఓడించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: