శ్రీకాకుళం పార్లమెంట్లో భారీ మెజార్టీతో గెలుపొందిన రామ్మోహన్ నాయుడు..!

Pulgam Srinivas
ఈ సారి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో వైసిపి ఒంటరిగా బరిలోకి దిగితే టిడిపి , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇకపోతే ఈ సారి బిజెపి తో పొత్తు పెట్టుకున్న కారణంతో టిడిపి , జనసేన కూడా అసెంబ్లీ స్థానాలతో పాటు భారీ మొత్తంలో లోక్సభ స్థానాలను కూడా దక్కించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలను చేసింది. ఇకపోతే మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి.

అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుండే అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా మొదలు అయింది. అందులో భాగంగా తాజాగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పెడన తిలక్ బరిలో ఉండగా , కూటమిలో భాగంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు బరిలో ఉన్నారు.

ఇకపోతే 2014 , 2019 సంవత్సరాలలో జరిగిన లోక్సభ ఎన్నికలలో రామ్మోహన్ నాయుడు తెలుగు దేశం పార్టీ నుండి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి రెండు సార్లు కూడా గెలుపొందారు. ఇక ఈయనకు తెలుగు దేశం పార్టీ 3 వ సారి కూడా ఇదే ప్రాంత పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చింది. ఇకపోతే ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచి ఉండడం ,  ప్రస్తుతం ఈ ప్రాంత సిట్టింగ్ ఎంపీ కావడంతో ఈయనకు ఈ ప్రాంతంలో గట్టి పట్టు ఉంది. ఇక తిలక్ ప్రస్తుత అధికార పార్టీ నేత కావడంతో ఈయనకు కూడా మంచి క్యాడర్ ఈ ప్రాంతంలో ఉంది.

దానితో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని మొదటి నుండి ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు అనుకుంటూ వస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితులు ఏవి ఈ రోజు కనబడలేదు. మొదటినుండి రామ్మోహన్ భారీ ఓట్లను దక్కించుకుంటూ వస్తున్నాడు. దానితో ఆయన ఏడు లక్షలకు పైగా ఓట్లను తెచ్చుకున్నారు. ఇక తిలక్ 4 లక్షలకి పైగా ఓట్లని తెచ్చుకున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rmn

సంబంధిత వార్తలు: