గుడివాడ : కొడాలి నానికి జీవితంలో మ‌ర్చిపోలేని అవ‌మానం... ఏపీకే ద‌మ్మున్న మొన‌గాడు ఈ రాము

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లోనే కొన్ని కోట్ల మంది ఓటర్లు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఫలితం కోసం ఎదురు చూస్తున్న నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ప్రాతినిథ్యం వహించిన గుడివాడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతి నుంచి జారిపోయింది. ఇప్పుడు గుడివాడ పేరు చెబితే కొడాలి నాని కంచుకోట అన్న మాట వినిపిస్తోంది. గత రెండు దశాబ్దాలకు పైగా గుడివాడను తన కంచుకోటగా చేసుకుని పార్టీలతో సంబంధం లేకుండా వరుసగా నాలుగుసార్లు గెలిస్తూ వస్తున్నారు నాని. గత రెండు ఎన్నికలలోను వైసీపీ నుంచి గెలిచిన నాని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ క్యాబినెట్‌లో తొలి మూడేళ్లపాటు మంత్రిగా కూడా పనిచేశారు. నాని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు , లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులకు ఈసారి టార్గెట్ అయ్యారు.

చంద్రబాబు సైతం ఈసారి కొడాలి నానిని గుడివాడలో ఎలాగైనా ఓడించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల‌ రాముకు ఏడాది క్రితమే పార్టీ పగ్గాలు అప్పగించారు. రాము కమ్మ సామాజిక వర్గం కాగా.. రాము భార్య సుఖద.. మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈసారి గుడివాడలో ఎస్సీ సామాజిక వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచూపిన పరిస్థితి కనిపించింది. నియోజకవర్గంలో గుడివాడ మున్సిపాలిటీ.. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గాలు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి గుడివాడలో తెలుగుదేశం పార్టీకి కూడా అంచనాలు ఉన్నాయంటూ గట్టి పోటీ అయితే ఎన్నికలకు ముందు నడిచింది.

అయితే న‌రాలు తెగే ఉత్కంఠ‌లా జ‌రిగిన గుడివాడ స‌మ‌రంలో అంతిమ విజేత‌గా మాత్రం వెనిగండ్ల రాముయే నిలిచారు. అస‌లు రాముకు కనివినీ ఎరుగ‌ని రేంజ్‌లో బంప‌ర్ మెజార్టీ వ‌చ్చింది. 13 రౌండ్ల‌కే ఏకంగా 44 వేల పై చిలుకు మెజార్టీ వ‌చ్చింది. ఏదేమైనా కొడాలి నానికి జీవితంలో మ‌ర్చిపోలేని ఘోర అవ‌మానం రాము మిగిల్చాడ‌నే చెప్పాలి. రాము కొడాలిని ఓడించి ఓ జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: