ఆముదాలవలస : సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ రెక్కలు విరిగాయిగా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో భాగంగా వై సి పి పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీలోకి దిగగా , తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పోటీలోకి దిగాయి. ఈ రెండు వర్గాలు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస సీటును దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలను చేసింది. అందులో భాగంగా ఇక్కడ చాలా కసరత్తు చేసి వై సి పి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాం ను నిలబెట్టగా , కూటమి కూన రవి కుమార్ ను చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎంపిక చేసుకుంది.

ఇక ఈ సీటును కచ్చితంగా దక్కించుకోవాలి అని ఇరు వర్గాలు అనుకోవడంతో ఇక్కడ పోటీలో నిలిచిన సీతారాం , రవి కుమార్ కూడా భారీ ఎత్తున ప్రచారాలను చేశారు. ఇక వీరిద్దరూ భారీ ఎత్తున చాలా రోజుల ప్రచారాలను చేయడం , వీరికి సపోర్టుగా ఈ పార్టీల ప్రధాన నేతలు వీరి గురించి ఎక్కువగా మాట్లాడుతూ రావడంతో వీరిద్దరి గెలుపుపై అక్కడి ప్రజలకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. దానితో ఈ ప్రాంత ప్రజలు మొదటి నుండి కూడా ఇటు సీతారాం అటు రవి కుమార్ మధ్య పెద్ద ఫైట్ నెలకొనే అవకాశం ఉంది అని , వీరి మధ్య చివరి వరకు ఉత్కంఠ పోరు జరగవచ్చు అని , ఎవరు గెలిచేది చెప్పడం కష్టం అని భావించారు.

ఇక ఈ రోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే చాలా అసెంబ్లీ స్థానాల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. తాజాగా ఆముదాలవలస అసెంబ్లీ స్థానం ఫలితం విడుదల అయింది. ఇక ఆముదాలవరుస లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కోన రవికుమార్ కి 85121 ఓట్లు రాగా , వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి తమ్మినేని సీతారాం కి 51938 ఓట్లు వచ్చాయి. దానితో రవి కుమార్ 33,183 ఓట్ల మెజారిటీతో సీతారాం పై భారీ విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: