అవనిగడ్డ : దివిసీమ గ‌డ్డ ప‌వ‌న్ ఫ్యాన్స్ అడ్డా... బుద్ధ ప్ర‌సాద్ కొట్టాడ్రా బంప‌ర్ విక్ట‌రీ..!

RAMAKRISHNA S.S.
దివిసీమగా పిలుచుకునే అవనిగడ్డ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం.. జనసేన పొత్తులో భాగంగా సమీకరణలు మారాయి. ఇక్కడ నుంచి 2014లో టీడీపీ తరఫున గెలిచిన మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ 2019 ఎన్నికలలో మాత్రం సింహాద్రి రమేష్ చేతిలో ఓడిపోయారు. ఈసారి జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గంగా అవనిగడ్డ మిగిలింది. అనూహ్యంగా గత రెండు ఎన్నికలలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన మండలి బుద్ధ ప్రసాద్.. ఎన్నికలకు ముందు జనసేనలో చేరి ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సింహాద్రి రమేష్.. ముందుగా మచిలీపట్నం వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా ఖరారు చేయబడ్డారు. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జ‌గ‌న్ పేరు ఖ‌రారు చేసిన డాక్ట‌ర్ సింహాద్రి చంద్రశేఖర్.. అవనిగడ్డ అసెంబ్లీ రేస్‌లో నిలిచారు.

జగన్ చివర్లో మళ్ళీ సింహాద్రి రమేష్ ను అవనిగడ్డ అసెంబ్లీ బరిలో దింపి.. సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయించారు. గత ఎన్నికలకు ఇప్పటికీ ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే.. బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేయటం ఒక్కటే. నియోజకవర్గంలో కోడూరు, చల్లపల్లి, నాగాయలంక, అవనిగడ్డ , మోపిదేవి , ఘంట‌శాల‌ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ రాజకీయాలను కాపులు బలంగా శాసిస్తారు. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ పార్టీ తరఫున ఎవరు గెలిచిన కాపు సామాజిక వర్గాల నేతలే గెలుస్తూ వస్తున్నారు. కృష్ణా జిల్లాలోని జనసేన , పవన్ అభిమానులు .. కాపు సామాజిక‌ వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అవనిగడ్డ కావడంతో.. ఇక్కడ కూటమి గెలుస్తుందన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి.

అయితే బుద్ధ ప్రసాద్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి పోటీ చేయడంతో ఏం జరుగుతుందన్న సందేహం అయితే ముందు నుంచి ఉంది. ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో బుద్ధ ప్ర‌సాద్ 45 + వేల భారీ మెజార్టీతో గెలిచి దివిసీమ గ‌డ్డ ప‌వ‌న్ ఫ్యాన్స్‌, జ‌న‌సేన అడ్డా అని స‌గ‌ర్వంగా ఫ్రూవ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: