ధూళిపాల నరేంద్ర: పొన్నూరు పోరు.. సైకిల్ జోరు.. ఫ్యాన్ పరారు ..!

Pandrala Sravanthi
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మరో కీలకమైన నియోజకవర్గం పొన్నూరు. అలాంటి ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమాహేమీలు పోటీపడ్డారు. ఇందులో ఒకరు సీనియర్ నేత అయితే మరొకరు కొత్త వ్యక్తి. ఆయన నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కాకుండా రాజకీయాలకు కూడా కొత్తే. అలాంటి ఆ వ్యక్తి ఈసారి సీనియర్ రాజకీయ వేత్తను ఢీ కొడుతున్నారు. ఆయన ఎవరయ్యా అంటే వైసిపి పార్టీ నుంచి పోటీ చేసే అంబటి మురళి. ఈయన టిడిపిలో ఎంతో సీనియర్ అయినటువంటి ధూళిపాళ్ల నరేంద్రాను ఢీ కొట్టబోతున్నారు. ఈ హోరాహోరీ పోరులో ప్రజలు ఏ వైపు ఉన్నారు. ఎవరికి ఓట్లు ఎక్కువగా పడ్డాయి అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది.
ఈ పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది చూద్దాం. వైసిపి నేత అంబటి మురళి కాపు సామాజిక వర్గం నేత. అంబటి రాంబాబుకు తమ్ముడు. సివిల్ ఇంజనీరింగ్ చదివి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా ఎదిగారు. ఇక ధూళిపాళ్ల నరేంద్ర కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజకీయవేత్త, కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగిందే. ఈయన తండ్రి వీరయ్య చౌదరి ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన వరుసగా పొన్నూరు నియోజకవర్గంలో ఐదు సార్లు  ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గంలో మొత్తం  కాపు ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి.
అలాంటి ఈ తరుణంలో కాపులు ఏ వైపు మొగ్గు చూపారు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో చాలా ఆసక్తికరమైన తీర్పునిచ్చారు ప్రజలు. టిడిపి నుంచి పోటీ చేసినటువంటి ధూళిపాళ్ల నరేంద్రని మరోసారి గద్దెనెక్కించారు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అంబటి మురళీకృష్ణను ఆమడ దూరం విసిరేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర కుమార్ 1,04,146 ఓట్లు సాధించగా, సమీప అభ్యర్థి అంబటి మురళీకృష్ణ 72,884 ఓట్లు సాధించారు. మొత్తం 19 రౌండ్లు ఉండగా 18 రౌండ్ల వరకే ఈ ఫలితం వచ్చింది. దీంతో మురళీకృష్ణ పై నరేంద్ర 31,262 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: