పి. గన్నవరం : కోన‌సీమ గ‌డ్డ‌.. జ‌న‌సేన అడ్డా... గెలిచాడ్రా ' గిడ్డి ' ... రాస్కో ప‌వ‌న్ ఇది నీ గెలుపు..!

RAMAKRISHNA S.S.
అమలాపురం పార్లమెంటు పరిధిలో కోనసీమ జిల్లాలో విస్తరించి ఉన్న ఎస్సీ నియోజకవర్గం పి. గన్నవరం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా అంతకు ముందు ఉన్న నగరి నియోజకవర్గం కాస్త పి. గన్నవరం నియోజకవర్గంగా మారింది. పి. గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో పాటు మామిడికుదురు మండలంలోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికలలో మూడు పార్టీలు విజయం సాధించాయి.

2009లో కాంగ్రెస్, 2014లో తెలుగుదేశం, 2019లో వైసిపి విజయం సాధించాయి. తాజా ఎన్నికలలో వైసీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేయగా.. నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబు వైసీపీ సీటు దక్కక కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక కూటమి పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేశారు. వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం నుంచి రాజేష్ మహాసేనకు ముందుగా చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు.

ఆయనపై వ్యతిరేకత రావడంతో పొత్తులో భాగంగా జనసేన ఈ సీటు తీసుకుని గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం సింబల్ పోటీలో ఉండి ఉంటే కచ్చితంగా కూటమి నేపథ్యంలో ఇక్కడ ఆ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు ఎన్నికలకు ముందు వినిపించాయి. అయితే ఈ సీటు జనసేన తీసుకుని పోటీ చేయడంతో బీసీ సామాజిక వ‌ర్గం నుంచి ఓట్ల బదిలీ జరిగిందా..? లేదా..? అన్న సందేహాలు అయితే వినిపించాయి. పీ. గన్నవరం సిటీలో వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరు నడిచింది అన్న ప్రచారం జరిగింది ఈ రోజు జరిగిన కౌంటింగ్లో దాదాపు 34 + ఓట్ల మెజార్టీతో గిడ్డి స‌త్య‌నారాయ‌ణ ఘ‌న విజ‌యం సాధించారు. ముందు నుంచి ఈ సీటు జ‌న‌సేన గెలుస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నా భారీ వేవ్‌తో భారీ మెజార్టీ ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: