జగన్: మందుబాబులే నిండా ముంచేసారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు చూసి వైసిపి పార్టీ షాక్ గురైంది. ముఖ్యంగా జగన్ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వెన్నుపోటు పొడిచినట్టుగా కనిపిస్తోంది.. ఒకటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో ఓటమి ఫాలు అవ్వడం.. మరొకవైపు రెడ్డి సామాజిక వర్గం కూడా రాయలసీమలో దెబ్బ తినడం... దాదాపుగా రెండు కోట్ల మందికి పైగా ప్రయోజనం చేకూర్చినప్పటికీ.. వాళ్లందరూ ఓట్లు వేస్తారు అనుకున్నప్పటికీ.. అది ఎదురు దెబ్బ తగిలింది.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే.. మద్యం అనేది జగన్ కొంప ముంచింది అనేటట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మద్యం ధరలు పెంచడం అన్నది కూడా మగవారికి చాలా శత్రుత్వంగా మార్చింది. ఆ ధరలు పెంచడం వల్ల జగన్ ఇచ్చినటువంటి డబ్బులు కూడా అయిపోతున్నాయనీ అనుకుంటున్నారేమో.. ఓటు వేయడానికి బార్లు తీరి వచ్చారు. కిందటిసారి జగన్కు ఓట్లు వేస్తే ఈసారి.. చంద్రబాబుకు ఓటు వేశారు. అలాగే మద్యానికి సంబంధించి బ్రాండ్లను కూడా మార్చి.. వాళ్లకు రెగ్యులర్గా తాగేటువంటి వాటిని మారిస్తే.. తాగడం తగ్గుతాది అనుకుంటే.. దీంతో ఏకంగా జగన్ కొంపే ముంచారు.. ప్రతిపక్షం లేని స్థాయికి తీసుకువచ్చారు.. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వమైనా సరే ఆచితూచి అడుగులు వేయాలనే విధంగా సంకేతాలు ఇచ్చారు.

ఈసారి 2019 ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తామని వైసిపి పార్టీ ధీమా ఉన్నప్పటికీ ఈ దెబ్బతో దీమాని కరిగిపోయింది.. మరి వైసిపి ఘోర మైన ఓటమి పైన అటు వైసీపీ నేతలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. ఇప్పటికే టిడిపి పార్టీ నేతలు అధినేత జనసేన పార్టీ నేతలు అధినేత సంబరాలను చేసుకుంటున్నారు. జూన్ 9వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లుగా వెల్లడించారు. మరి టిడిపి జనసేన, బిజెపి మూకుమ్మటిగా  ఏర్పాటు అయ్యి వైసిపి పార్టీని అనుకున్నట్టుగానే ఓడించాయి. మరి ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం ఏవిధంగా నెరవేరుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: