ఏపీ రాజకీయ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన..!

lakhmi saranya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలలో టిడిపి మరియు జనసేన, బిజెపి కూటమి భారీ విజయం దిశగా పరుగులు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంతవరకు ఏ పార్టీ కూడా సాధించని రీతిలో ఘనవిజయం సాధించబోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతత్యం లోని జనసేన పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఫలితాల్లో దూసుకుపోతుంది. ఎన్డీఏ కూటమి పత్తిలో భాగంగా జనసేనకు వచ్చిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం దిశగా జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.
ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోటీ చేసిన అన్ని చోట్ల గలుపు దిశగా సాగుతూ జనసేన వంద పార్లమెంట్ విన్నింగ్ స్ట్రైక్ రేడ్ నమోదు దిశగా ప్రయాణిస్తుంది. అధికార వైసిపి ప్రస్తుతం 10 సీట్లలోనే లీడ్ లో ఉండడంతో టిడిపి తరువాత ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. గత ఎన్నికలలో కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్న జనసేన ఈసారి అనూహ్యంగా పుంజుకుని పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపు దిశగా సాగడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంసంగా మారింది. ఇక ఈ పరిణామం తో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా దక్కనుంది.
ఎన్నికల ముందు వరకు కూడా గాజు గుర్తు విషయంలో జనసేన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ లిస్ట్ లో పెట్టడంతో జనసేన పలుమార్లు రిక్వెస్ట్ చేసి తర్వాత గాజు గుర్తులు ఈసీ జనసేనకు కేటాయించింది. ఇక తాజాగా జనసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడంతోపాటు గాజు గుర్తు శాశ్వత సింబల్గా దక్కడానికి కావాల్సిన ఓటింగ్ పర్సంటేజ్ ను సాధించుకుంది. దీంతో ఇక జనసేనకు గాజు గుర్తు విషయంలో నెలకొన్న ఇబ్బందులు ఫటా ఫట్ మాయమయ్యాయి. ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల భారీ విజయంతో పాటు గాజు గుర్తు పార్టీ శాశ్వత సింబల్ దక్కడానికి మార్గం సుగమం కావడంతో జనసేన అభిమానులు మరియు కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒకే ఎన్నికల్లో జనసేన డబుల్ జాక్పాట్ కొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: