అప్పుడు బిఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్.. కిషనన్నను టచ్ కూడా చేయలేదు?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా అవతరించింది. ఏకంగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకుని అధికారాన్ని చేపట్టింది. అయితే ఇలా అధికారం లో ఉన్న సమయం లో కూడా బిఆర్ఎస్ పార్టీకి ఒక విజయం మాత్రం సాధ్యం కాలేదు. అదే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయం. అధికారంలో ఉండి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలు బిజెపికి పట్టం కట్టారు తప్ప.. అటు బిఆర్ఎస్ పార్టీని మాత్రం నమ్మలేదు. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

 ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా లో ఉంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఇక ఈ సమయంలో ఎప్పటిలాగానే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా కారు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు.  అయితే ఎప్పటిలాగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకరికి సికింద్రాబాద్ ఓటర్లు పట్టం కడతారా అనే విషయంపై ఉత్కంఠ నెలకొనగా.. అందరూ అనుకున్నదే జరిగింది. పాత సెంటిమెంట్ రిపీట్ అయింది. కాషాయ పార్టీ హ్యాట్రిక్ కొట్టేసింది.

 ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో సారి ఘన విజయాన్ని అందుకున్నారు. బిఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కాంగ్రెస్ తరపున హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసిన అటు కిషన్ రెడ్డి గెలుపును మాత్రం ఆప  లేకపోయారు. ఈ క్రమం లోనే వరుసగా రెండో సారి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో విజయం సాధించగా.. ఇక బిజెపికి ఇక్కడ ఇది హ్యాట్రిక్ కావడం గమనార్హం. ఏకంగా 65 పైసలుకు ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ విజయం సాధించారు కిషన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: