కూటమిని గెలిపించిన ముగ్గురు మొనగాళ్లు.. దండయాత్ర మామూలుగా లేదుగా!

Reddy P Rajasekhar
ఏపీలో కూటమి అధికారంలోకి రావడం పక్కా అని తేలిపోయింది. 155కు పైగా స్థానాలతో ఏపీ రాజకీయాల్లో కూటమి సరికొత్త చరిత్ర సృష్టించనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమిని గెలిపించిన ముగ్గురు మొనగాళ్లు చంద్రబాబు, పవన్, మోదీ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ముగ్గురు ప్రధాన నేతలు ఏకం కావడంతో కుంభస్థలాన్నే బద్దలుగొట్టారు. ఏపీలో కూటమి దండయాత్ర మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ కంచుకోటలను కూకటివేళ్లతో సైతం కూటమి పెకిలించివేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో సైతం జగన్ కు ముచ్చెమటలు పట్టేలా వైసీపీకి కనువిప్పు కలిగేలా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అన్ని జిల్లాల్లో కూటమి అద్భుతాలు చేస్తుంటే ఫ్యాన్ మాత్రం మూగబోయింది. కడప అసెంబ్లీ స్థానంలో సైతం మాధవీరెడ్డి విజయం సాధించి జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెప్పేశారు.
 
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పవన్ కుటుంబ సభ్యులు సైతం ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. బాబు, పవన్, మోదీ ఏపీని శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపించడం ఖాయమని రాబోయే ఐదేళ్లలో దేశంలోని ప్రధాన రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఏపీ ఎదగడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కూటమి వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసిందని తెలుస్తోంది.
 
మెరుగైన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరుగుతుందనే ఆకాంక్షతో ఏపీ ప్రజలు కూటమిని గెలిపించుకోగా చంద్రబాబు, పవన్ తమ నమ్మకాన్ని నిజం చేయడం ఖాయమని ఏపీ ఓటర్లు భావిస్తున్నారు. హల్లో ఏపీ బైబై వైసీపీ అనే నిదానం ఏపీలో నిజమైంది. కూటమి సునామీలో ఫ్యాన్ రెక్కలు విరిగిపడుతున్నాయి. బాబు, మోదీ, పవన్ కలిసి పోటీ చేస్తే ఏపీలో ఎప్పటికీ తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాబు, పవన్ కష్టానికి 2024 ఎన్నికల ఫలితాల రూపంలో తగిన ఫలితం దక్కిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: