ఏపీ ప్రజలు ‘వైనాట్’ కూటమి అనేశారా?

Reddy P Rajasekhar
వైసీపీ వై నాట్ 175 నినాదంతో రాజకీయాలు చేయగా ఏపీ ప్రజలు మాత్రం వై నాట్ కూటమి అనేశారు. రాష్ట్రంలో కూటమి ఊహించని ఫలితాలతో అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. టీడీపీ 126 స్థానాల్లో జనసేన 19 స్థానాల్లో బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉండగా వైసీపీ కేవలం 22 స్థానాల్లో ముందంజలో ఉంది. వైసీపీని నమ్ముకుని బెట్టింగ్స్ పెట్టిన వాళ్లు నిండా మునిగినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏదో జరగబోతుందని సంకేతాలు వ్యక్తం కాగా ఆ సంకేతాలే నిజమయ్యాయి. ఏపీ ఎలక్షన్స్ 2024 ట్యాగ్  ట్రెండింగ్ లో ఉండగా కూటమికి అనుకూల ఫలితాలు రావడం ఒకెత్తు అయితే జనసేన స్థాయిలో కూడా వైసీపీ సత్తా చాటలేకపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మూడు పార్టీల పొత్తు వైసీపీని చిత్తు చేసిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
బాబు గెలిస్తే తమకు మరింత మెరుగైన సంక్షేమం, పథకాలు అందుతాయని భావించి ఓటర్లు మరోసారి బాబును గెలిపించుకోవాలని ఫీలైనట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు జనసేనకు సైతం ఊపిరి పోశాయి. పిఠాపురంలో ఊహించని మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని తేలిపోయింది. జనసేన పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో సత్తా చాటుతూ ప్రభంజనం సృష్టిస్తోంది.
 
చంద్రబాబు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆలోచనలు ఏపీ పొలిటికల్ లెక్కలను పూర్తిస్థాయిలో మార్చేశాయి. వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని భావించిన నియోజకవర్గాల్లో సైతం నిరాశజనకమైన ఫలితాలే వస్తున్నాయి. ఏపీ ఓటర్ల నాడి సర్వేలకు సైతం అంతు చిక్కలేదని మరోసారి క్లారిటీ వచ్చింది. మరోసారి రాష్ట్రంలో అధికారం సాధిస్తామన్న వైసీపీ కలలు కలలుగానే మిగిలిపోయాయనే చెప్పాలి. టీడీపీ ప్రభంజనం నేపథ్యంలో వైసీపీ కార్యాలయం బోసిపోయిందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం సంబరాలు జరుపుకుంటోందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలతో వైసీపీ బాధ వర్ణనాతీతం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: