టీడీపీ: సైకిల్ జోరు.. అక్కడ మొదలైన సంబరాలు..!

Divya
2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 ఎన్నికలు అత్యంత ఉత్కంఠ గా సాగిన విషయం తెలిసిందే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు పూర్తి అవ్వగా.. ఈరోజు ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు విషయానికి వస్తే.. చాలామంది ఉద్యోగులు టిడిపికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లడమే.. ఇక్కడ వైసిపికి బెడిసి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగస్తులు యువత నిరుద్యోగులు ఇలా చాలామంది మోసపోయారని అందుకే వైసిపికి ఓట్లు పడడం లేదని స్పష్టం అవుతోంది.

ఇకపోతే సైకిల్ జోరు పెరిగింది అని.. అప్పుడే సంబరాలు మొదలుపెట్టేశారు ప్రత్యేకించి  విజయవాడలో అంబరాలు మొదలయ్యాయి.. అక్కడ పేలుతున్న బానసంచాను చూస్తుంటే సైకిల్ జోరు చూపిస్తోంది. చాలామంది బాణాసంచా పేలుస్తూ విజయకేతనం ఎగరేస్తున్నారు. ఇక తాజాగా వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను బట్టి చూస్తే తామే ఆదిక్యంలో ఉన్నామని సంబరాలు చేసుకుంటూ ఉండడం గమనార్హం.
ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలుగా పోటీకి దిగాక.. ఒక్కరు కూడా ముందంజలో లేకపోవడం పలు ఆశ్చర్యాలకు అనుమానాలకు దారితీస్తోంది. అసలు వీరంతా ప్రజల కోసం ఏమి చేయలేదా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు సైతం ఆరాతీస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కుప్పం నుంచి 1934 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి కేవలం 1934 ఓట్ల ఆదిక్యంలోనే కనిపిస్తోంది.. మరి ఈ నెంబర్ మారే అవకాశం ఉందా లేక ఇంకా ఆయన ఆదిక్యత సాధించే అవకాశాలు ఉన్నాయా?  ఇంకొంచెం సేపు ఆగి ఉండాల్సిందే. మొత్తానికి అయితే పలుచోట్ల టిడిపి ఆదిక్యంలో ఉండడంతో తామే గెలిచామనే సంబరం చేసుకుంటున్నారు టిడిపి శ్రేణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: