విజయవాడ.. పార్లమెంట్ లో ఏకంగా అన్ని ఓట్లతో టీడీపీ ముందంజ..!

Pulgam Srinivas
మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఇక ఈ రోజు ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా ఉదయం నుండే ఎలక్షన్ కమిషన్ ఓ వైపు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు చేస్తూనే , మరో వైపు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఓట్లను కూడా లెక్కిస్తుంది.

ఇకపోతే ఈ సారి అధికార పార్టీ అయినటువంటి వై సి పి ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగితే , టి డి పి , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇకపోతే ఈ రెండు వర్గాలు కూడా మొదటి నుండి విజయవాడ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని గట్టి పట్టుతో ఉన్నాయి. ఇక ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా కేశినేని నాని పోటీలో ఉండగా , కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్న బరిలో ఉన్నారు. వీరిద్దరూ సంత అన్నదమ్ములు కావడం , వీరిద్దరికీ ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉండడంతో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది అని మొదటి నుండే జనాలు భావించారు.

ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కూడా వీరి మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించిన తాజా రౌండు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా విజయవాడ లోక్సభ టి డి పి అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని , వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి కేశినేని నాని పై 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా ..? లేకపోతే కేశినేని చిన్ని ని నాని వెనక్కి నెట్టేసి ముందుకు వస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: