తగ్గేదేలే..వారణాసిలో దుమ్ములేపుతున్న నరేంద్రుడు ?
ఏ టీవీ ఛానల్ పెట్టిన... బిజెపి కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి రౌండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు... దాదాపు 250 స్థానాలలో బిజెపి లీడింగ్ అవుతుంది. ఇక ఈసారి కూడా వారణాసిలో పోటీ చేసిన నరేంద్ర మో డీ... మూడోసారి గెలిచి హైట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే... ఎన్నికల కౌంటింగ్ లో... ప్రధాని నరేంద్ర మోడీ దూకు డును చూపి స్తున్నారు. మొదటి రౌండ్ నుంచి... ప్రధాని నరేంద్ర మోడీ లీడింగ్ లోనే ఉన్నాడు. తగ్గేదేలేదన్నటుగా..వారణాసిలో దుమ్ములేపుతున్నారు నరేంద్రుడు. దీంతో బిజెపి పార్టీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
ఇక అటు అరుణచల్ ప్రదేశ్ పశ్చిమలో కిరణ్‌రిజిజు ఆధిక్యం ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండిలో కంగనరనౌత్ వెనుకంజలో ఉండటం మనం చూస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌నేత శశిథరూర్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీ ఆధిక్యంలో ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో నటుడు రవికిషన్ ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ డైమండ్ హర్బర్‌లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ఆధిక్యంలో ఉండటం మనం చూస్తున్నారు. విదిశాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర బారామతిలో సుప్రీయ సులే ఆధిక్యంలో ఉండటం మనం చూస్తున్నాం. కర్ణాటక మండ్యలో ఆధిక్యంలో మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు. ఇక వరుసగా ఎన్నికల ఫలితాలు వస్తూనే ఉన్నాయి.