వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇది ఆవిర్భవించి తక్కువ కాలమే అయినా కానీ ఎక్కువ ఫలితాలను చవిచూసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ విధంగా ఎన్నో సంచలన ఫలితాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినటువంటి జగన్ ను ఈ నియోజకవర్గాలు మాత్రం వనికిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో గెలవలేక పోయారు. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన ఆ నియోజకవర్గాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.. 2019 ఎలక్షన్స్ టైం లో ఉమ్మడి విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసిపి దాని పక్కన ఉన్నటువంటి విశాఖ జిల్లాలో 11 సీట్లు గెలిచి, మరో నాలుగు చోట్ల ఓడిపోయింది.
ఇందులో విశాఖ, దక్షిణ, తూర్పు, పశ్చిమం ప్రాంతాల్లో తన పట్టు నిలుపుకోలేకపోయింది. ఇదే ఫలితం 2014లో ఇదే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 8 చోట్ల వైసీపీ జెండా ఎగరవేసింది. కానీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలి, ఇచ్చాపురంలో వైసీపీ జెండా పాత లేకపోయింది. 2014లో కూడా ఇదే ఫలితం. అంతేకాకుండా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పాలకొల్లు,ఉండి నియోజకవర్గాల్లో కూడా వైసిపి ఇంతవరకు బోణి కొట్టలేదు.
అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు,రేపల్లె వెస్ట్ నియోజకవర్గాల్లో కూడా వైసిపి టచ్ చేయలేకపోయింది. అంతేకాకుండా చంద్రబాబు సొంత ప్రాంతమైనటువంటి కుప్పం ఆయన బావమరిది బాలకృష్ణ హిందూపురంలో కూడా వైసిపి గెలవలేక పోతోంది. ఇక ఇవే కాక మరికొన్ని నియోజకవర్గాలు కూడా వైసిపి ఖాతాలో చేరలేదు. ఈసారి ఈ ప్రాంతాల్లో వైసిపి బోణి కొడుతుందా లేదంటే సాంప్రదాయం ప్రకారం అక్కడ మళ్ళీ టిడిపి నే గెలుస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తెలియబోతోంది.