ఏపీ: ఎగ్జిట్ పోల్స్ చెప్పేదిదే..అధికారం వారిదేనా..?
పీపుల్ పల్స్:
ఎంతో నిబద్ధత కలిగినటువంటి పీపుల్ పల్స్ సర్వే సంస్థ కూటమి గెలుస్తుందని తెలియజేసింది. మొత్తం 95 నుంచి 110స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలియజేస్తోంది. ఈ సర్వే సంస్థ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఖచ్చితమైన అంచనా వేసింది. కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది. అలా తెలంగాణలో కాంగ్రెస్సే విజయం సాధించింది.
ఆరా ఎగ్జిట్ పోల్స్:
ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని తెలియజేసింది. లోక్సభలో 13 నుంచి 15 వైసిపికి, 10నుంచి 12 టిడిపికి రావచ్చు అని తెలియజేసింది.
చాణక్య ఎక్స్ ఎగ్జిట్ పోల్ :
ఈ సర్వే సంస్థ టిడిపి 78 స్థానాల్లో గెలుస్తుందని, మరో 31 గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. వైసిపి 32, మరో 15 గెలవబోతుందని చెప్పింది. పార్లమెంటులో టిడిపికి 18 వైసీపీకి ఏడు గెలుస్తుంది అని చెప్పింది.
పార్తా దాస్ ఎగ్జిట్ పోల్స్:
ఈ సర్వే సంస్థ వైసీపీకి 110 నుంచి 120 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టిడిపికి 55 నుంచి 65 వస్తాయని తెలియజేసింది.
చాలా వరకు సర్వే సంస్థలు చెప్పింది 65 నుంచి 75 శాతం వరకు నిజమవుతుంది. అలాంటి ఈ తరుణంలో మరి ఈ సర్వే సంస్థలు తెలిపిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పలితాలు వస్తాయా లేదా అనేది తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే.