రాజకీయం.. ఈ పదంలోనే పెద్ద కయ్యం ఉంటుంది. ఈ రాజకీయాలను పూర్తిగా ఒంట పట్టించుకుంటే మాత్రం కుటుంబం మనవాళ్లు, దగ్గర వాళ్లు అనేది చూడరు. గెలుపే లక్ష్యంగా ముందుకు పోతుంటారు. ఈ రాజకీయాల్లో తండ్రి కొడుకుల మధ్య పోటీ ఏర్పడిన ఆయన తండ్రే కదా మా కొడుకే కదా అని ఎవరూ ఆలోచించరు. ఇద్దరు ప్రత్యర్థులుగా ఉండి గెలుపోటముల కోసం పోట్లాడుతూనే ఉంటారు అదే రాజకీయాల్లో స్పెషాలిటీ. అలాంటి రాజకీయాలు ఏపీలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. ఓవైపు టిడిపి కూటమి మరోవైపు వైసీపీ.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో విపరీతంగా కొట్లాడారు.
చివరికి మే 13వ తేదీన ఎన్నికలు ముగిసాయి. ఇంకా నాలుగు రోజుల్లో రిజల్ట్ కూడా బయటకు రానుంది. అలాంటి ఈ తరుణంలో రెండు పార్టీలు గెలిస్తే మంత్రి పదవులను ఎవరెవరికి ఇవ్వాలి, ఓడినా తర్వాత చేసేటువంటి కర్తవ్యాలను ముందుగానే చర్చించుకుంటున్నారట. ఇదే తరుణంలో ఈసారి టిడిపి ఓడిపోతే మాత్రం ఇక రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే. ఈ క్రమంలోనే టిడిపికి దిక్కు ఎవరు అనే ప్రశ్న కూడా శ్రేణుల్లో ఉన్నది. ఈ క్రమంలోనే టిడిపి ఓడిపోయిన పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ గెలిస్తే మాత్రం నెక్స్ట్ ప్రతిపక్షంగా గట్టిగా నిలబడేది పవనే అనే ఒక టాక్ వినిపిస్తోంది.
అయితే పవన్ గెలిస్తే మాత్రం మంగళగిరిలో లోకేష్ ఓడిపోవాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారట. లోకేష్ గెలిస్తే మళ్ళీ చంద్రబాబు లోకేష్ కు పెద్దపీట వేసి టిడిపి పార్టీని ఆయన చేతుల్లో పెడతారనే ఒక అంశం తెరపైన ఉంది. అందుకే పవన్ లోకేష్ ఓడిపోయి తాను గెలవాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోని లోకేష్ కూడా పవన్ ఓడిపోతే టిడిపిలో నేనే హైలెట్ అవ్వచ్చనే ఆలోచనతో ఉన్నారట. ఇలా ఇద్దరు కూటమి పార్టీల నుంచి ఒకరికొకరు ఓడిపోవాలని మనసులోనే అనుకుంటున్నారని కొంతమంది కూటమి నాయకులు చర్చించుకుంటున్నారట.